Begin typing your search above and press return to search.
బీసీ రిజర్వేషన్లు.. టీడీపీ ద్వంద్వ వైఖరితో బుక్ అవుతోంది!
By: Tupaki Desk | 4 March 2020 7:45 AM GMTస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరితో అడ్డంగా బుక్ అవుతూ ఉండటం గమనార్హం. స్థానిక ఎన్నికల విషయంలో రిజర్వేషన్లను పెంచారని, వాటిని 59 శాతం స్థాయికి తీసుకెళ్లారని కేసులు వేసిందీ తెలుగుదేశం పార్టీ వాళ్లే, మరోవైపు బీసీలకు 60 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం లేదని జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నదీ తెలుగుదేశం పార్టీనే కావడం గమనార్హం!
ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరవై శాతం రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వం విఫలం అయ్యిందని అంటున్నారు. అలాగే ఆ పార్టీ బీసీ నేతల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు కూడా అదే మాటే అంటున్నారు. 60 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లాలంటూ తెలుగుదేశం పార్టీ అంటోంది. అయితే ఇప్పటికే ఎన్నికలు లేట్ అయ్యాయి, ఇప్పుడు మళ్లీ కోర్టుల చుట్టూ తిరిగితే.. స్థానిక ఎన్నికలు జరగకపోవడం వల్ల కొన్ని నిధుల విడుదల కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది.
50 శాతానికి మించి రిజర్వేషన్లను ఖరారు చేశారంటూ తెలుగుదేశం నేత బిర్రు ప్రతాపరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఫలితంగానే కోర్టు స్పందించింది. అయితే పిటిషన్ వేసిన వ్యక్తి తమ పార్టీ నేతల కాదంటూ టీడీపీ వాదిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఈ విషయంలో ఘాటుగా స్పందిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తో, లోకేష్ తో సదరు ప్రతాపరెడ్డి తీయించుకున్న ఫొటోలను వారు ప్రస్తావిస్తూ ఉన్నారు. వారితో అంత సన్నిహితంగా ఫొటోలు దిగిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతనా? అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు.
అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం అతడు తమ వాడు కాదని అంటోంది. ఆ పార్టీ నేతలు కొందరేమో రిజర్వేషన్లను 50 శాతానికి మించి ఎలా పెంచుతారంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కమ్మ నేతలు కొందరు ఈ ప్రశ్న వేశారు. అయితే యనమల మాత్రం 60 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలంటూ డిమాండ్ చేసేశారు! చంద్రబాబు నాయుడు ఇదే వాదన వినిపిస్తూ ఉన్నారు. తమకు అన్నింటిలోనూ ద్వంద్వ వైఖరి అలవాటు అయినట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ల స్పందన ఉందని పరిశీలకులు అంటున్నారు.