Begin typing your search above and press return to search.
ఎట్టకేలకూ స్పందించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి!
By: Tupaki Desk | 23 July 2019 2:30 PM GMTఅనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శంకర్ నారాయణకు తొలి సారి గెలవగానే మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. పెనుకొండ నుంచి ఎన్నికైన శంకర్ నారాయణకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అలా ప్రాధాన్యతను ఇచ్చారు. అనంతలో పార్టీ సీనియర్లు చాలా మందే ఉన్నా జగన్ వారిని కాకుండా బీసీ అయిన శంకర్ నారాయణకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు బీసీ సంక్షేమ శాఖనే కేటాయించారు.
అయితే శంకర్ నారాయణ మంత్రి పదవి తీసుకున్నా పెద్దగా స్పందించడం లేదు అనే టాక్ ఒకటి ఉంది. జిల్లా రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరని, ఎక్కువగా నియోజకవర్గానికి పరిమితం కావడం, తన కుల సంఘాలు చేసే సన్మానాలు స్వీకరించడమే ఆయన చేస్తున్నారనే ప్రచారం సాగుతూ ఉంది.
మంత్రిగా అవకాశం వచ్చినా ఈ లాయర్ అంత యాక్టివ్ లేరు.. అనే అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో స్పందించారు. బీసీలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక బిల్లులను తీసుకు వచ్చిన నేపథ్యంలో బీసీల సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ స్పందించారు.
గత ప్రభుత్వ తీరును వివిధ అంశాల్లో ఈయన విమర్శించారు. బీసీలను చంద్రబాబు నాయుడు కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప, వారి అభ్యున్నతికి ఏ మాత్రం తోడ్పడలేదని శంకర్ నారాయణ ధ్వజమెత్తారు. బీసీల సమస్యలను పరిష్కరించే దృఢ సంకల్పం జగన్ మోహన్ రెడ్డికే ఉందని అసెంబ్లీలో ప్రసంగించారు శంకర్ నారాయణ. ఇలా స్పందిచడాన్ని అయితే ఆయన మొదలుపెట్టారు.