Begin typing your search above and press return to search.
గంగూలీపై పంతం నెగ్గించుకున్న రవి శాస్త్రి!
By: Tupaki Desk | 18 July 2017 1:17 PM GMTగంగూలీపై రవిశాస్త్రి తన పంతం నెగ్గించుకున్నాడు. రవి శాస్త్రి కోరుకున్నట్లుగా టీమిండియా బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ - అసిస్టెంట్ కోచ్ గా సంజయ్ బంగర్ ల పేర్లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. వీరిద్దరూ వచ్చే వరల్డ్ కప్ వరకూ కొనసాగుతారని స్పష్టం చేసింది. వీరి నియామకం తో ప్రధాన కోచ్ రవిశాస్త్రి పంతం నెగ్గినట్లయింది. మరొకవైపు ఫీల్డింగ్ కోచ్ గా ఆర్ శ్రీధర్ ను నియమించే అవకాశముంది. రవి శాస్త్రి ఒత్తిడికి తలొగ్గి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం ప్రధాన కోచ్ ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ - రవిశాస్త్రి ల మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే.
బీసీసీఐ తాజా నిర్ణయంతో రాహుల్ ద్రవిడ్ - జహీర్ ఖాన్ లకు షాక్ తగిలింది. ముందుగా సచిన్ - గంగూలీ - లక్ష్మణ్ లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) రాహుల్ ద్రవిడ్ - జహీర్ ఖాన్ లను రవిశాస్త్రికి సహాయకులు నియమించిన సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరినీ నియమించడం రవి శాస్త్రికి ఏ మాత్రం ఇష్టం లేదు. దీనిపై రవిశాస్త్రి బహిరంగంగానే మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అయితే, తాము రవి శాస్త్రిని సంప్రదించాకే జహీర్ - రాహుల్ ల పేర్లు ప్రతిపాదించామని సీవోఏకు సచిన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాము నిస్వార్థంగా ప్రధాన కోచ్ - సహాయ సిబ్బందిని నియమించినా తమపై విమర్శలు రావడం బాధించిందని ఆ లేఖలో పేర్కొన్నాడు. తాము జట్టు ప్రయోజనాల కోసమే ఇలా చేశామని సచిన్ తెలిపాడు.
సీవోఏ కూడా ద్రవిడ్ - జహీర్ ల ఎంపికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన కోచ్ బాధ్యతను సీఏసీకి అప్పచెబితే, మరో ఇద్దరి పేర్లను సూచించడాన్ని తప్పుబట్టింది. ప్రధాన కోచ్ కే సహాయక సిబ్బందిని నియమించుకునే స్వేచ్ఛ ఉందంటూ రవిశాస్త్రికి మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీ రవిశాస్త్రి మాటకు విలువిచ్చింది. ఆయన కోరినట్లే భరత్ అరుణ్ - సంజయ్ బంగర్ లను ఎంపిక చేసింది. అయితే రాహుల్ ద్రవిడ్ - జహీర్ ఖాన్ ల సలహాలు జట్టుకు అవసరమని రవి శాస్త్రి అన్నాడు. దానికి తాను అభ్యంతరం చెప్పనని రవిశాస్త్రి తెలిపాడు. అయితే, ద్రవిడ్ - జహీర్ లకు వేరే బాధ్యతలు అప్పచెబుతారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.