Begin typing your search above and press return to search.
13 మందికి కరోనా పాజిటివ్ .. బీసీసీఐ అధికారిక ప్రకటన !
By: Tupaki Desk | 29 Aug 2020 5:00 PM GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 లో పాల్గోనబోయే టీమ్స్ లో ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మంది కరోనా పాజిటివ్ బారిన పడ్డారని బీసీసీఐ శనివారం వెల్లడించింది. ఇటీవల 1,988 కరోనా పరీక్షలు జరపగా, 13 మంది కరోనా బారినపడినట్టు గుర్తించామని తెలిపింది. వీరిని ఇతర టీమ్ సభ్యుల నుంచి దూరంగా ఉంచుతామని తెలిపింది.
'యూఏఈ' లో పాల్గోనే అన్ని టీమ్ లకు చెందిన 1,988 మంది ఆటగాళ్లకు ఆగస్టు 20 నుంచి 28 వరకూ ఆర్‌టీ-పీసీఆర్ కోవిడ్ పరీక్షలు జరిపాం. వారిలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టీమ్ మేనేజిమెంట్, బీసీసీఐ సిబ్బంది, ఐపీఎల్ ఆపరేషనల్ టీమ్, హోటల్, గ్రౌండ్ ట్రాన్స్‌పోర్ట్ సిబ్బంది ఉన్నారు' అని బీసీసీఐ తెలిపింది. ఇద్దరి ఆటగాళ్లతో సహా 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వీరంతా ఐపీఎల్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నారని వివరించింది. ఐపీఎల్ 2020 'హెల్త్ అండ్ సేఫ్టీ' ప్రోటోకాల్ ప్రకారం, ఐపీఎల్ -2020 సీజన్ పూర్తయ్యేంత వరకూ పార్టిసిపెంట్లకు నిరంతర పరీక్షలు నిర్వహిస్తామని బీసీసీఐ చెప్పింది. 12 మంది CSK సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఇంతకు ముందు వార్తలు వచ్చినప్పటికీ, టీమ్ పేరు మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. టీ-20 టోర్నమెంట్ 13వ అడిషన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ యూఏఈలో జరుగనుంది. ఫైనల్ మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. వీకెండ్ కాకుండా ఓ సాధారణ రోజులో ఫైనల్ మ్యాచ్ జరుగనుండటం టోర్నమెంట్ హిస్టరీలో మంగళవారం ఇదే మొదటిసారి.