Begin typing your search above and press return to search.

విరాట్ కోహ్లి అధికారాలకు బీసీసీఐ కత్తెర..?

By:  Tupaki Desk   |   4 Nov 2021 7:44 AM GMT
విరాట్ కోహ్లి అధికారాలకు బీసీసీఐ కత్తెర..?
X
భారత క్రీడాకారులు ఎన్నో ఆశలు పెట్టుకున్న టీ 20 క్రికెట్ ప్రపంచ కప్.. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. అయితే ఆ తరువాత అప్ఘనిస్తాన్ తో భారీ విజయం సాధించడంతో కాస్త ఊరటనిచ్చింది. దీంతో సెమిస్ వెళ్లేందుకు అవకాశం వచ్చినట్లయింది. అయితే తరువాతి మ్యాచులు కచ్చితంగా గెలవవాల్సిన అవసరం ఉంది. దీంతో కోహ్లిసేనపై కాస్త ఒత్తిడి ఉందనే భావించవచ్చు. తరువాత ఎదురయ్యే జట్లు పెద్దగా పోటీ ఇవ్వకపోయినా.. చిన్న అంచనా వేస్తే మాత్రం మొదటికే మోసం రావచ్చు. దీంతో ఇండియన్ జట్టు సభ్యులు నిన్నటి మ్యాచ్ విజయం సాధించినా పెద్దగా ఆనందం లేకుండా పోయింది. అయితే జట్టుపై కోహ్లి సేన పట్టు ముందే కోల్పోయాడా..? అందువల్లనే అతను సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడా..? అనే చర్చ సాగుతోంది.

టీ 20 మొదటి మ్యాచ్ పాకిస్తాన్ తో తలపడింది. ఇండియాకు ఇది అత్యంత కీలక మ్యాచ్. భారతీయులు, పాకిస్తానీయుల మధ్య బావోద్వేగాలు పెంచే మ్యాచ్. అయితే ఈ దీనిని కోల్పోయింది. ప్రపంచ కప్ లల్లో ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ పై ఓడిపోయిన రికార్డు లేదు. కానీ కోహ్లి సేన ఆ రికార్డును బ్రేక్ చేసింది. దీంతో జట్టుపై.. ముఖ్యంగా కోహ్లీసేనపైపే విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి కోహ్లినే బాధ్యుడిని చేస్తూ కొందరు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. కొందరు మాత్రం ఇలాంటి ఓటములు సహజం అని అంటున్నారు.

అయితే కోహ్లీ బాధ్యతలకు బీసీసీఐ ముందే కత్తెర వేసిందనే కొత్త వాదన వినిపిస్తోంది. అందుకే విరాట్ కోహ్లి టీ20 టీం సెలక్షన్ సమయంలోనే తాను ఇక టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అతనిపై కొన్న ఒత్తిడిలు వచ్చిన కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కోహ్లి ఆధ్వర్యంలో వరల్డ్ కప్ లోనూ టీం పేవల ప్రదర్ననే ఇచ్చింది. ఫైనల్ వరకు చేరినా కప్ ను సాధించలేకపోయింది. ఇప్పుడు టీ 20 లోనూ కోహ్లి తన ప్రతాపం నిరూపించుకోలేకపోయాడని విమర్శలు వచ్చాయి.

ఇదిలా ఉండగా టీం ఇండియా హెడ్ కోచ్ గ రాహుల్ ద్రావిడ్ పేరును బీసీసీ ఐ బుధవారం ప్రకటించనుంది. దీంతో కోహ్లి, రాహుల్ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అయితే రాహుల్ ద్రావిడ్ ఎంపికలో కోహ్లి నిర్ణయాన్ని బీసీసీఐ పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. సాధారణంగా హెడ్ కోచ్ లను నియమించేటప్పుడు కెప్టెన్ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో కుంబ్లే ఆ బాధ్యతల నుంచి తొలగిపోవడానికి కోహ్లినే కారణమని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ విషయంలో కోహ్లిని పట్టించుకోకపోవడంతో బీసీసీఐ కోహ్లిని పలు విషయాల్లో దూరం పెట్టిందని అంటున్నారు.

ప్రపంచ కప్ తరువాత న్యూజిలాండ్ పర్యటన ఉంది. ఈ సీరిస్ లో రాహుల్ హెడ్ కోచ్ గా వ్యవహరించనున్నారు. అయితే టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లి ఇదివరకే ప్రకటించారు. అయితే ఆ తరువాత వన్డే, టెస్ట్ సిరీసుల విషయంలో కోహ్లి ఇదే నిర్ణయం తీసుకుంటాడా..? లేక కెప్టెన్సీగానే కొనసాగుతాడా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ కెప్టెన్సీగా కొనసాగిన రాహుల్, కోహ్లీల మధ్య సఖ్యత ఉంటుందా..? లేక ఏమైనా మార్పులు వస్తాయా..? అని అంటున్నారు. వరల్డ్ కప్ లు మినహా మిగతా టోర్నీలో కోహ్లీ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. వ్యక్తిగతకంగా ఈయన ఎన్నో రికార్డులు సాధించాడు. కానీ వరల్డ్ కప్ కు వచ్చేసరికి తడబడడంపై పై నుంచి వస్తున్న ఒత్తిడియే కారణమా..? అని అనుకుంటున్నారు.