Begin typing your search above and press return to search.

ఇదేం డిమాండ్​..! పాకిస్థాన్​పై బీసీసీఐ ఫైర్​..!

By:  Tupaki Desk   |   2 March 2021 4:30 AM GMT
ఇదేం డిమాండ్​..! పాకిస్థాన్​పై బీసీసీఐ ఫైర్​..!
X
టీ20 వరల్డ్ ​కప్​ భారత్​ వేదిక గా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఓ వింత డిమాండ్​ చేసింది. తమ క్రీడాకారుల వీసాల మంజూరుపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు కోరింది. అయితే ఈ డిమాండ్ ​పై బీసీసీఐ ప్రతి నిధులు స్పందిస్తూ.. ఇదో వింత డిమాండ్​ అని.. అపరిపక్వతతోనే ఇటువంటి డిమాండ్లు చేస్తున్నారని పేర్కొన్నది.

ఈ ఏడాది అక్టోబర్​-నవంబర్​ లో భారత్ వేదికగా టీ20 ప్రపంచ కప్​ జరుగనున్నది. టీ20లో పాల్గొనేందుకు పాకిస్థాన్ ఆటగాళ్లకు అభిమానులకు, జర్నలిస్టులకు వీసాలు మంజూరు చేయాలని పీసీబీ చైర్మన్ ఎహ్‌సాన్ మణి డిమాండ్ చేశారు. ఈ విషయంపై మార్చి నెలాఖరులోగా బీసీసీఐ తమ నిర్ణయం చెప్పాలని.. అలాగే వీసాలపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని లేని పక్షంలో ఈ టోర్నీని యూఏఈకి మార్చాలని మేము ఐసీసీకి లేఖ రాస్తామని కూడా పీసీబీ చైర్మన్​ మణి డిమాండ్​ చేశారు. దీంతో బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పీసీబీ వ్యాఖ్యలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని బీసీసీఐ అధికారులు అన్నారు. పాకిస్థాన్​ ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నదని.. అందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నదని బీసీసీఐ పేర్కొన్నది. ‘టీ20 టోర్నీ నుంచి నిష్క్రమించేందుకే మణి ఈ తరహా వ్యాఖ్యలు చేశారేమో. ఏ బోర్డు అయినా ఓ విషయంపై కచ్చితమైన హామీ పత్రం ఇవ్వదు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. ఇక భారత దేశంలో అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి అథ్లెట్లు ఉన్న అన్ని దేశాలు అర్హులే. వారికి వీసాల మంజూరు చేస్తాం" అని బీసీసీఐ స్పష్టం చేసింది.