Begin typing your search above and press return to search.

ఇట్స్ అఫీసియల్... ఐపీఎల్-2020 రద్దు

By:  Tupaki Desk   |   16 April 2020 1:40 PM GMT
ఇట్స్ అఫీసియల్... ఐపీఎల్-2020 రద్దు
X
అనుకున్నంతా అయ్యింది. యావత్తు ప్రపంచంలోని క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాదికి సంబంధించిన సీజన్ రద్దైపోయింది. ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆటగాళ్లతో పాటు ఆటను ఆస్వాదించేందుకు వచ్చే క్రికెట్ లవర్స్, టోర్నీని నిర్వహణలో పాలుపంచుకునే యంత్రాంగం. ఆయా జట్ల యాజమాన్యాల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్-2020 ని రద్దు చేస్తున్నట్లు బీసీపీఐ గురువారం మద్యాహ్నం సంచలన ప్రకటన చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఒలింపిక్స్ సహా విశ్వవ్యాప్తంగా వివిధ క్రీడలకు సంబంధించిన పలు టోర్నీలన్నీ ఇప్పటికే రద్దైపోయిన సంగతి తెలిసిందే.

అయితే ఐపీఎల్ కు ఉన్న ప్రాముఖ్యం, విశ్వవ్యాప్తంగా ఆ టోర్నీకి దక్కుతున్న ఆదరణనున పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ... ఇతర టోర్నీల మాదిరే ఐపీఎల్ ను అప్పటికప్పుడు రద్దు చేసేందుకు ససేమిరా అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 29న ముంబైలోని ప్రతిష్ఠాత్మక స్టేడియం వాంఖడేలో మొదలుకావాల్సిన ఐపీఎల్-2020ని ఈ నెల 15కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికి కూడా కరోనా వైరస్ విస్తరణ ఇంకా తగ్గకపోవడం, భారత్ లో వైరస్ వ్యాప్తి పీక్ స్టేజ్ కు చేరుకున్నదన్న వాదనల నేపథ్యంలో ఐపీఎల్ తాజా సీజన్ ను వాయిదా వేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ క్రమంలో గురువారం బీసీసీఐ ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. విశ్వవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిన ఐపీఎల్ -2020 సీజన్ ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా సదరు ప్రకటనలో బీసీసీఐ ప్రకటించేసింది. ఐపీఎల్ జట్ల యాజమాన్యాలు, బ్రాడ్ కాస్టర్లు, స్పాన్సరర్లతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బీసీసీఐ తెలిపింది. ఇక వాయిదా పడిన ఈ ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందన్న విషయంపై అంతగా క్లారిటీ ఇవ్వని బీసీసీఐ... పరిస్థితులు ఎప్పుడు చక్కబడితే అప్పుడు, సీజన్ మొదలెట్టేందుకు ఇది సరైన సమయం అని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఈ సీజన్ ను నిర్వహిస్తామని మాత్రమే బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది.