Begin typing your search above and press return to search.
ఐపీఎల్ ఆదాయం ఎంతో తెలిస్తే.. నోరెళ్ళబెట్టాల్సిందే
By: Tupaki Desk | 23 Nov 2020 3:36 PM GMTబీసీసీఐ కి ఐపీఎల్ నిజంగా బంగారు బాతే. దాని గుండా ప్రతి ఏటా బోర్డుకు వేల కోట్ల ఆదాయం వస్తోంది. అందుకే ఈసారి కరోనా కారణంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ వాయిదాపడినా.. బీసీసీఐ మాత్రం ఐపీ ఎల్ ను వాయిదా వేయలేదు. మనదేశంలో ఆడే పరిస్థితి లేకున్నా.. దుబాయ్ కి వెళ్లి మరి.. ఆటగాళ్లను బయో బబుల్ లో ఉంచి మ్యాచ్ లను కొనసాగించారు. ఇప్పుడు బీసీఐ పడ్డ శ్రమకి తగిన ఫలితమే లభించినట్లయింది. ఐపీఎల్ నిర్వహణ వల్ల బోర్డు కు రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది.
ఐపీఎల్ సీజన్ వచ్చేసిందంటే ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టెయిన్మెంట్. ఐపీఎల్ సీజన్లో సినిమాల విడుదలను కూడా ఆపేస్తారంటే దీనికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఐపీఎల్ ద్వారా కొత్త ఆటగాళ్లు పరిచయం అవుతారు. తమ టాలెంట్‌ను నిరూపించుకొనేందుకు యువ క్రికెటర్లకు కూడా ఇది మంచి అవకాశం. ఐపీఎల్లో ఇచ్చిన ప్రదర్శన ఆధారంగానే వివిధ దేశాలు తమ జట్లను ఎంపికచేసుకుంటాయి. ఆటగాళ్లకు ఆదాయంతో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి. ప్రతి ఐపీఎల్ సీజన్లో వేలకోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కరోనా ఎఫెక్ట్‌తో ఐపీఎల్2020 లో కొంచెం హడావుడి తక్కువగా ఉంది. చీర్‌గర్ల్స్, స్టేడియంలో అభిమానులు లేకపోవడంతో ఈ సారి కొంత సందడి తక్కువైంది. అయినప్పటికీ టీవీల ముందు మాత్రం ప్రేక్షకుల ఎంజాయ్ చేశారు. గత సీజన్కంటే 25 శాతం అధికంగా టీవీ వీక్షకులు పెరిగారని బీసీసీఐ పేర్కొన్నది.
మొత్తానికి ఈ సీజన్లో ఐపీఎల్ ద్వారా సుమారు రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చినట్టు బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు పాటు ప్రేక్షకులను ఐపీఎల్ అలరించింది. సీజన్ నిర్వహణ మొత్తంలో 35 శాతం ఖర్చులు కూడా తగ్గించుకున్నట్టు బీసీసీఐ తెలిపింది. ఈ సీజన్లో స్టార్ క్రికెటర్లు ధోనీ, విరాట్‌కోహ్లీ, రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు. యువక్రికెటర్లు రాహుల్, నికోలస్ పూరన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ రబాడా, రషీద్ ఖాన్ స్టార్లుగా నిలిచారు. రోహిత్ శర్మ సారథ్యం వహించిన ముంబై ఇండియన్స్ టైటిల్‌ను దక్కించుకున్నది.