Begin typing your search above and press return to search.
ఈ టాస్ కాయిన్ చాలా స్పెషల్ గురూ
By: Tupaki Desk | 2 Oct 2015 5:11 PM ISTభారత్.. దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న క్రికెట్ సిరీస్ లో ఉపయోగించే టాస్ ను ప్రత్యేకంగా రూపొందించారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే మహాత్మగాంధీ.. నెల్సన్ మండేలా సిరీస్ ధర్మశాలలో ఈ రాత్రి 7 గంటల నుంచి టీ20 మ్యాచ్ తో స్టార్ట్ కానుంది. అయితే.. ఈ క్రికెట్ సిరీస్ కోసం ఒక ప్రతేక కాయిన్ ను తయారు చేయించారు. ఈ సిరీస్ లోని అన్ని మ్యాచ్ ల టాస్ గా ఈ కాయిన్ నే వినియోగించనున్నారు.
20 గ్రాముల బరువు ఉండే ఈ కాయిన్ ను వెండితో తయారు చేసి.. బంగారు పూతను అద్దారు. ఇక కాయిన్ బొమ్మ భాగంలో జాతిపిత మహాత్మగాంధీ.. దక్షిణాఫ్రికా నల్లసూరీడు నెల్సన్ మండేలా బొమ్మలు ఉంటాయి. బొరుసు భాగంలో భారత్ క్రికెట్ సిరీస్ లోగోను ముద్రించారు. ఈ ప్రత్యేక కాయిన్ ను బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఆవిష్కరింనున్నారు.