Begin typing your search above and press return to search.
ధోనీకి 'పద్మ భూషణ్' దక్కుతుందా?
By: Tupaki Desk | 20 Sep 2017 12:42 PM GMTభారత క్రికెట్ కెప్టెన్లలో టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేకతే వేరు. టీమిండియా కెప్టెన్లలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోనీ ఖ్యాతి గడించాడు. మరే భారత కెప్టెన్ సాధించలేని విధంగా మూడు ఐసీసీ ట్రోఫీలను ధోనీ సాధించాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను ధోనీ ఆధ్వర్యంలోని టీమిండియా కైవసం చేసుకుంది. భారత క్రికెట్‌కు ధోనీ అందించిన సేవలకు తగిన గుర్తింపునిచ్చేందుకు బీసీసీఐ పావులు కదుపుతోంది. దేశంలో మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషన్ కు ధోనీ పేరును బీసీసీఐ సిఫారసు చేసింది. ఒక వేళ ధోనీకి పద్మభూషణ్ లభిస్తే ఆ ఘనత సాధించిన 11వ క్రికెటర్ గా చరిత్ర పుటలలో నిలిచిపోతాడు.
బీసీసీఐ తరపున ఈ ఏడాది పద్మ అవార్డులకు ధోని పేరును ఏకగ్రీవంగా సిఫారసు చేసినట్టు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నావెల్లడించారు. ధోనీ పేరును ఏకగ్రీవంగా బోర్డు సభ్యులందరూ నామినేట్ చేశారని తెలిపారు. సమకాలిన క్రికెట్ లోని గొప్ప ఆటగాళ్లలో ధోనీ ఒకడని, ఈ పురస్కారానికి ధోనీ పేరును ప్రతిపాదించడం సముచితమని చెప్పారు. కెప్టెన్‌గా టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోని 302 వన్డేలు ఆడి 10 సెంచరీలతో 9737 పరుగులు సాధించాడు. 90 టెస్టుల్లో 6 సెంచరీలతో 4876 పరుగులు, 78 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో1212 పరుగులు చేశాడు. ధోని టెస్టులలో 256 క్యాచ్ లు, వన్డేల్లో 285 క్యాచ్ లు, టీ 20ల్లో 43 క్యాచ్ లు అందుకున్నాడు. మొత్తం మూడు ఫార్మాట్ లలో 584 క్యాచ్ లతో పాటు 163 స్టంపింగ్ లు చేశాడు. ధోని ఇప్పటికే అర్జున, రాజీవ్ ఖేల్ రత్న, పద్మశ్రీ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే.
ధోనీని పద్మ భూషణ్ అవార్డుకు బీసీసీఐ నామినేట్ చేయడం వరకు బాగానే ఉంది. అయితే, మిస్టర్ కూల్ కు ఈ అవార్డు దక్కుతుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. క్రీడా రంగం నుంచి ఇంకా నామినేషన్ లు వచ్చే అవకాశముంది. మిగిలిన రంగాల నుంచి, క్రీడాకారుల నుంచి ధోనీకి గట్టిపోటీ ఎదురవయ్యే చాన్స్ ఉంది. గత సంవత్సరం కూడా కచ్చితంగా పద్మ అవార్డు వరిస్తుందనుకున్న వారికి ఆ ఘనత దక్కలేదు. చివరి నిమిషంలో సమీకరణాలు తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ నామినేట్ చేసిన ధోనీకి పద్మభూషణ్ అవార్డు దక్కుతుందో లేదో వేచి చూడాలి.