Begin typing your search above and press return to search.
రాజకీయాల్లోకి 'దాదా'.. దా దా అంటున్నదెవరు?
By: Tupaki Desk | 2 Jun 2022 1:30 AM GMTటీమిండియా మాజీ సారథి, బీసీసీఐ చైర్మన్ సౌరభ్ గంగూలీ రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? భారత క్రికెట్ లో అత్యుత్తమ కెప్టెన్ గా నిలిచిన బెంగాల్ ప్రిన్స్ కొత్త రంగంలోకి అడుగుపెట్టనున్నారా? గంగూలీ తాజాగా చేసిన ట్వీట్ ను చూస్తే ఔననే అనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు సైతం గంగూలీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. సౌరభ్ ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన 2109 సెప్టెంబరులో ఈ పదవిలోకి వచ్చారు. మూడేళ్ల పదవీ కాలం.. అంటే ఈ సెప్టెంబరుతో ముగియనుంది. దీంతో గంగూలీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశం అవుతోంది. సౌరభ్ పశ్చిమ బెంగాల్ కు చెందినవారు. కోల్ కతా లో సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగారు.
బెంగాల్ రాజకీయాల్లో కీలకమే..
పశ్చిమ బెంగాల్ ఎప్పుడూ దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. అక్కడ ఎక్కువ కాలం సీపీఎం అధికారంలో ఉన్నందునో.. 11 ఏళ్లుగా మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ దూకుడు రాజకీయాల్ల వల్లనో గాని బెంగాల్ నిత్యం నిప్పు కణిక. గంగూలీ గనుక రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే అది బెంగాల్ రాజకీయాల్లో కీలక అంశం అవుతుంది. వాస్తవానికి బెంగాల్ ను ప్రస్తుతం మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు. ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీది పార్టీ, ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానం. ఇక ప్రతిపక్ష బీజేపీ సువేందు అధికారిని నమ్మకుంది. గతేడాది సరిగ్గా ఈ రోజుల్లో జరిగిన ఎన్నికల్లో బెంగాల్ బీజేపీ పరం అవుతుందని భావించారు. సువేందు.. మమతా బెనర్జీని ఓడించినా, బీజేపీకి మాత్రం అధికారం దక్కలేదు.
అప్పుడే వచ్చి ఉంటే..
గంగూలీని గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందే రాజకీయాల్లోకి లాగే ప్రయత్నాలు జరిగాయి. ఆయనను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం అభ్యర్థిగా చూపుతూ బీజేపీ ముందుకెళ్లాలని
నిర్ణయించింది. భాజపాకు చెందిన కీలక నేతలు గంగూలీ ఇంటికి వెళ్లి ఆయనతో మంతనాలు జరపడం, తీవ్ర ఒత్తిడి కూడా తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే, బీజేపీ ఆఫర్ ను తిరస్కరించలేక గంగూలీ తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయినట్లు కనిపించింది. అందుకనే ఆయన గుండె నొప్పికి గురయ్యారు. ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. బీజేపీ ఒత్తిడి వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఇక ఈ లోగానే అసెంబ్లీ ఎన్నికలు రావడం, సువేందు అధికారిని నమ్ముకుని బీజేపీ ముందుకెళ్లడం జరిగిపోయాయి.
ఆలస్యమైనా.. ఏం చేస్తారో మరి?
గంగూలీ గతేడాది ఎన్నికల సందర్భంగానే బీజేపీ తరఫున పోటీ చేయడమో, ప్రచారం చేయడమో చేసి ఉండి, పార్టీ బెంగాల్ లో గెలిచి ఉంటే ఆయన సీఎం అయ్యేవారు. అప్పట్లో బెంగాల్ లో బీజేపీదే గెలుపన్న వాతావరణం ఏర్పడింది. దానిని ఎన్నికల వరకు లాక్కెళ్లినా.. హోరాహోరీ సమరంలో ఓడిపోయింది. అయితే, గంగూలీనే నేరుగా రంగంలోకి దిగి ఉంటే బీజేపీకి కలిసి వచ్చేదని ఓ అంచనా. ఇక ఇప్పట్లో బెంగాల్ ఎన్నికలు లేవు. ఆ రాష్ట్రంలో బీజేపీ బలహీన పడుతోంది. నాయకులు వెళ్లిపోతున్నారు. మరి.. గంగూలీ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీని ఆశ్రయిస్తారు? టీఎంసీలోకి వెళ్తారా? లేక బీజేపీలో చేరతారా? ఒకవేళ బీజేపీలోకి వెళ్తే.. ఆయనను కేంద్ర మంత్రిని చేసే అవకాశం ఉంటుంది. గంగూలీ స్థాయికి అది సరైనది కూడా. టీఎంసీలో చేరితే రాష్ట్రానికో,లేదా రాజ్యసభ సభ్యత్వానికో పరిమితం కావాల్సి ఉంటుంది.
ఇదీ గంగూలీ ట్వీట్..
గంగూలీ చేసిన ట్వీట్ రాజకీయ ఎంట్రీకి సంబంధించిందేనని వార్తలు గుప్పుముంటున్నాయి. క్రీడా జీవితాన్ని ప్రారంభించి 30 ఏళ్లు గడిచాయని, ఇప్పుడు మరో కొత్త మార్గంలో నడవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు గంగూలీ ట్వీట్ చేశారు. ‘1992లో క్రీడా జీవితాన్ని ప్రారంభించాను. 2022 నాటికి 30 ఏళ్లు గడిచాయి. క్రికెట్ నాకు ఎంతో అందించింది. ముఖ్యంగా మీ ఆదరాభిమానాలు పొందగలిగాను. ఈరోజు ఈ స్థానంలో ఉండేందుకు నా వెన్నుతట్టిన, నాకు అండగా నిలిచిన, నాతోపాటు ఉన్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. ప్రజలకు సహాయపడేలా ఇకపై ఏదైనా చేయాలని భావిస్తున్నా. ఈ కొత్త ప్రయాణంలో కూడా మీరు నాకు ఇలాగే మద్దతు ఇస్తారని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌గా వైరల్‌గా మారింది. గంగూలీ రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంగూలీ రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఊహాగానాలు రావడంపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఇంకా రాజీనామా చేయలేదని వెల్లడించారు.