Begin typing your search above and press return to search.
'విశ్వ' విజేతలకు బీసీసీఐ భారీ నజరానాలు..
By: Tupaki Desk | 8 Aug 2021 4:12 AM GMTవిశ్వక్రీడా వేదికపై భారత జెండా రెపరెపలాడింది. ఒలింపిక్స్ క్రీడలో ఇండియన్ క్రీడాకారుల తమ సత్తా చాటారు. పతకం ఏదైనా పేరు వస్తే చాలనుకున్న సమయంలో ఏకంగా స్వర్ణం సాధించడం క్రీడాలోకానికి గర్వకారణం. వ్యక్తిగతంగా స్వర్ణం సాధించడమంటే మాములు విషయం కాదు. 2008లో షూటింగ్లో బంగారు పతకం రాగా.. ఇప్పుడు జావెలిన్ త్రోలో స్వర్ణం మెరిసింది. అథ్లెటిక్స్ విభాగం కాస్త వెనుకబడుతుందనుకుంటున్న సమయంలో నీరజ్ చోప్రా తన ప్రతిభతో రికార్డు సృష్టించాడు. వందేళ్ల తరువాత అథ్లెటిక్స్ లో ఏకంగా బంగారు పతకం రావడం దేశ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అటు నీరజ్ తో పాటు కాంస్యం, రజతం పతకాలు సాధించిన వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వాలు, సంస్థలు ప్రత్యేక నజరానాలు ప్రకటిస్తున్నారు.
ప్రతీసారి ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య పెంచుకుంటూ పోతుంది. అంతేకాకుండా కేవలం కాంస్యం వరకే పరిమితం అనుకున్న సమయంలో స్వర్ణం కూడా సాధించగలం అని చాటిచెబుతున్నారు. ఇక జాతీయ క్రీడా హాకీ కనుమరుగువతుందా..? అనుకుంటుండగా కాంస్యంతో తిరిగి వచ్చారు. బ్యాడ్మింటన్ పవర్ ఏమాత్రం తగ్గలేదన్నట్లు మరో పథకంతో సింధు అధరగొట్టింది. ఇలా క్రీడా రంగం ప్రతీ సారి పదునుపెడుతూ పతకాల సంఖ్యం పెంచుకుంటూ పోతుంది. మరోవైపు భారత ప్రభుత్వం కూడా క్రీడా రంగాన్ని అనేక రకాలుగా ప్రోత్సహిస్తోంది.
మరోవైపు బీసీసీఐ కూడా క్రీడాకారులకు భారీ నజరానను ప్రకటించింది. బీసీసీ సెక్రటరీ జై షా ట్వీట్ చేస్తూ ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులకు నజరానాలను ఇస్తామని తెలిపింది. ఇందులో భాగంగా భారత్ కు ఏకైక స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు కోటి రూపాయలు, రజతం సాధించిన మీరాబాయి చాను , రవికుమార్ దాహియాకు రూ.50 లక్షలకు ప్రకటించింది. ఇక కాంస్యం సాధించిన బజరంగ్` పూనియా, లవ్లీనా , పీవీ సింధులకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. హాకీ జట్టుకు రూ.1.25 లక్షల నగదును బీసీసీఐ ప్రకటించింది.
ఈసారి ఒలింపిక్స్ తో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా హరియాణా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన బంగారు పతకం సాధించాడని తెలియగానే ఆయన సొంత గ్రామంలో సంబరాలు జరిగాయి. మరోవైపు ఆ రాష్ట్రప్రభుత్వం రూ. 6 కోట్ల నగదును ప్రకటించింది. అంతేకాకుండా గ్రేడ్-1 ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా నీరజ్ చోప్రా ఇప్పటికే సీఆర్పీఎప్ లో సుబేదార్ గా పనిచేస్తున్నారు. దీంతో ఆయన పతకం సాధించడంపై జవాన్లు సంబరాలు చేసుకున్నారు. త్రివర్ణ పతకాలు ఊపుతూ డప్పు, వాయిద్యాలు వాయించారు.
నీరజ్ కు ఇండిగో ఏయిర్ లైన్స్ కూడా ఆఫర్ ఇచ్చింది. ఏడాది పాటు ఆయన అపరిమితంగా విమానంలో ప్రయాణించవచ్చని తెలిపింది. జావెలిన్ త్రోలో ఆయన స్వర్ణం సాధించినందుకు ఈ ఆఫర్ ను శనివారం ప్రకటించింది. ఈనెల 8వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 7వ తేదీ వరకు అపరిమితంగా విమానంలో ప్రయాణించవచ్చని, అందుకు సంబంధించిన టికెట్లు ఇస్తామని ప్రకటించింది.
క్రీడారంగంలో కనీవెరుగని ప్రతిభను సాధిస్తున్న ఆటగాళ్లు ఇలా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఆఫర్లు ప్రకటించడం హర్షణీయమని క్రీడాలోకం చాటి చెబుతోంది. ఇలాంటి ప్రోత్సాహం ఉంటే మరింత మంది క్రీడాకారులు దేశంలో నుంచి పుట్టుకొస్తారని అంటున్నారు. సారి పతకాలు సాధించిన భారత్ వచ్చే ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అంటున్నారు. పేద, ధనిక అని తేడా లేకుండా క్రీడా రంగంలో ప్రతిభ ఉంటే రాణించవచ్చని చాలా మంది ఇప్పటికే నిరూపించారు.