Begin typing your search above and press return to search.
భారత్ నుంచే ఐసీసీకి 80శాతం ఆదాయం..
By: Tupaki Desk | 12 Jan 2023 11:30 PM GMTక్రికెట్ కు పుట్టినిల్లు ఇంగ్లండ్ అయినా.. ఆ క్రికెట్ కు ఊపు తెచ్చింది మాత్రం ఇండియానే.. బ్రిటీష్ వారు మనకు ఈ క్రికెట్ ను అంటగట్టినా అది మన దేశంలోకి విస్తృతంగా వెళ్లింది. నరనరాన జీర్ణించుకుంది. క్రికెట్ అంటే ఒక మతంలా మారింది. అందుకే క్రికెట్ అంటే దేశంలో పిచ్చ క్రేజ్. ఐపీఎల్ వచ్చాక ఇది మరింతగా ఇనుమడించింది. ఇప్పటికీ దేశంలో క్రికెట్ తో కొన్ని కోట్ల వ్యాపారం జరుగతోంది.
మన దగ్గర ఉన్న క్రికెట్ క్రేజ్ అంతా ఇంతాకాదు.. భారత్ లేనిదే ప్రపంచ క్రికెట్ లేదు. ఇటీవల భారత్ తమ దేశంలోకి రాకుంటే తాము ఆసియా కప్ లో ఆడమంటూ సవాల్ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా తన పదవిని పోగొట్టుకున్నాడు. భారత్ తో పెట్టుకుంటే ఆయన పోస్ట్ ఊస్ట్ అయిపోతుందని తెలియదు పాపం.
ఎందుకంటే భారత్ నుంచే ఐసీసీకి అన్ని దేశాలకు 80శాతం ఆదాయం వెళుతుంది. ఐసీసీకి ఆదాయ వనరుగా టీమిండియా ఉంది. ప్రస్తుతం ఐసీసీ ఆదాయంలో 70 శాతం భారత్ మార్కెట్ నుంచి వస్తుండగా ఇది మరింత పెరిగే అవకాశం ఉందట.. మరి నాలుగేళ్లలో ఈ మొత్తం 80శాతానికి చేరుతుందని క్రికెట్ బజ్ తాజాగా అంచనావేసింది.
క్రికెట్ ప్రసారాలకు సంబంధించి ఇటీవల స్టార్ , జీ సంస్థలు ఏకంగా నాలుగేళ్లకు 3 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్ ఇందులో కీలక పోషిస్తుందని పేర్కొంది. ఐపీఎల్ ద్వారా ఏడాదికే 3వేల కోట్లను బీసీసీఐ ఆర్జిస్తోంది. ఐసీసీకి ఏకంగా 80శాతం ఆదాయం ఇస్తోంది.
అందుకే ఐసీసీలో కూడా టీమిండియా కనీసం సెమీస్ చేరేలా షెడ్యూల్ వేస్తుంది. టీమిండియా తొలి రౌండ్ లో ఓడిపోతే ఆ కప్ లో ఐసీసీకి నష్టాలే. ఇంతలా మన దేశ క్రికెట్ ప్రపంచ క్రికెట్ సంఘాన్ని శాసిస్తోందంటే అతిశయోక్తి కాదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.