Begin typing your search above and press return to search.
ఐపీఎల్ 2022 పై కీలక ప్రకటనతో గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ
By: Tupaki Desk | 22 Nov 2021 3:30 AM GMTటీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శనపై భారత క్రీడాభిమానులు ఇంకా నిరాశతోనే ఉన్నారు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ గెలిచినా వారిలో ఉత్సాహం ఇంకా పెరగలేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ నెక్ట్స్ సీజన్ భారత్ లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా కారనంగా ఐపీఎల్ -2020, 2021 సీజన్లు యూఏఈలో నిర్వహించారు.
దీంతో భారత క్రీడాభిమానులు ప్రత్యక్షంగా చూడలేని పరిస్థితి ఎదురైంది. మరోవైపీ ఈసారి ప్రేక్షకులను కూడా స్టేడియంలోకి అనుమతించే అవకాశం ఉంది. దీంతో 2022 ఐపీఎల్ ను ఇక్కడే నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గినందున క్రికెట్ అభిమానులు పండుగ చేసుకునేందుకు అవకాశం వచ్చింది.
ఈమేరకు ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ సెక్రెటరీ జై షా కీలక ప్రకనటన చేశారు.ఐపీఎల్ 2020 భారత్ లో నిర్వహించకపోయినా 2021 మొదటి దశను భారత్లోనే నిర్వహించారు. ఆ తరువాత కరోనా కేసులు పెరగడంతో రెండో దశను దుబాయ్ వేదికగా నిర్వహించారు.
ఇక ఐపీఎల్ 2022 సీజన్ కోసం త్వరలో ఆటగాళ్ల వేలం పాటను నిర్వహించనున్నారు. కాగా ఈసారి 8 జట్లు కాకుండా 10 జట్లు పాల్గొనబోతున్నాయి. ఇప్పటి వరకు లీగ్ లో లేని అహ్మదాబాద్, లక్నో జట్లు కొత్తగా చేరుతున్నాయి. ఇప్పటి వరకు 8 జట్లు ఉండగా ఈ రెండు జట్టు చేరికతో మొత్తం 10 జట్లు ఆడబోతున్నాయి.
టీ20 వరల్డ్ కప్ తరువాత భారత్, న్యూజిలాండ్ మధ్య పోరు సాగుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచులు గెలిచింది. అంటే మూడు మ్యాచుల్లో రెండింటిని భారత్ గెలుచుకోవడంతో సిరీస్ కైవలం చేసుకుంది. అయితే న్యూజిలాండ్ తో మరో రెండు టెస్టులు ఆడనుంది.
ఇప్పటివరకు స్టేడియంలోకి కేవలం ఆటగాళ్లు మాత్రమే వచ్చారు. ప్రేక్షకులను అనుమతించలేదు. కానీ భారత్ -న్యూజిలాండ్ సిరీస్ లో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించారు. దీంతో తరువాతి జరిగే ఐపీఎల్ సీజన్లో అభిమానులను అనుమతిందచే అవకాశం ఉందని అంటున్నారు.
దీంతో రెండేళ్ల తరువాత అభిమానుల మధ్య క్రీడాకారులు తమ ప్రతిభ చూపనున్నారు. ఈ మేరకు జే షా ఆ విషయాన్ని కూడా చెప్పారు. అయితే ఈసారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆడుతుందని బీసీసీఐ సెక్రటరీ తెలిపారు. ఈసారి 10 జట్లతో పోరు ఉత్కంఠ భరితంగా సాగనుందని, అభిమానుల సమక్షంలో ఇది మరింత ఉత్సాహాన్నిస్తుందని బీసీసీ సెక్రెటరీ అన్నారు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్ కి ఆరుసార్లు టైటిల్ అందించిన ధోనీ చివరి మ్యాచ్ ఎక్కడ ఉంటుందన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. తన అభిమాన చెపాక్ స్టేడియంలోనే ధోని చివరి మ్యాచ్ ఉంటుందని జే షా తెలిపారు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ నేనెప్పుడు నా క్రికెట్ ముగింపును ప్రత్యేకంగా ప్లాన్ వేసుకుంటానని అన్నాడు.
నా చివరి మ్యాచ్ రాంచీలోనే ఆడాను. వన్డేల్లో చివరి హోమ్ మ్యాచ్ కూడా రాంచీలోనే ఆడాను. అలాగే చివరి టీ 20 కూడా చెన్నైలోనే ఉంటుందని అనుకుంటున్నాను అని అన్నారు. అయితే వచ్చే ఏడాది లేదా ఐదేళ్ల తరువాత ఉంటుందని అన్నారు. దీంతో అభిమానుల్లో ఒకింత ఉత్సాహం మరింత ఆందోళన మొదలైంది.
మరోవైపు ఐపీఎల్ ఆటగాళ్ల వేలం త్వరలో జరగనుంది. ఈసారి కొత్త జట్లు చేరడంతో మరింత మంది క్రీడాకారులను చూడొచ్చని అంటున్నారు. ఇప్పటికే వివిధ దేశాలనుంచి క్రీడాకారులు ఆయా జట్లలో లీనమయ్యారు. ఇక త్వరలో జరిగే వేలంలో కొత్త ఆటగాళ్లు ఎంతమంది జాయిన్ అవుతారో చూడాలని చర్చించుకుంటున్నారు.