Begin typing your search above and press return to search.
కోహ్లీని సైడ్ చేసిన బీసీసీఐ.. రోహిత్ కు పగ్గాలు
By: Tupaki Desk | 25 Oct 2019 6:39 AM GMTవచ్చే వన్డే ప్రపంచకప్, ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ లను దృష్టిలో పెట్టుకొని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని మెల్లిగా పక్కనపెట్టే యోచనలో బీసీసీఐ ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20, టెస్ట్ సిరీస్ లకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ అనూహ్యంగా టీ20ల నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడం గమనార్హం.
ప్రపంచకప్ లో ఓటమి తర్వాత కోహ్లీ కంటే రోహిత్ బెటర్ అన్న కామెంట్స్ వినపడుతున్న నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీ సామర్థ్యాలను పరీక్షించేందుకు బీసీసీఐ నడుం బిగించింది. ఇప్పటికే టీ20లలో విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ కు రికార్డ్ ఉండగా.. టీ20లలో విరాట్ కోహ్లీకి పేలవమైన రికార్డ్ ఉంది. ఈ నేపథ్యంలోనే టెస్టులకు విరాట్ ను కెప్టెన్ గా ప్రకటించిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.. టీ20లకు వచ్చేవరకు మాత్రం కోహ్లీకి రెస్ట్ ఇచ్చి పగ్గాలను రోహిత్ కు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సమావేశమై బంగ్లాదేశ్ తో టీ20, టెస్ట్ సిరీస్ లకు భారత జట్టును ప్రకటించింది. టెస్టులకు విరాట్ ను కెప్టెన్ గా కొనసాగించారు. టీ20లకు మాత్రం కోహ్లీకి రెస్ట్ ఇచ్చి రోహిత్ కు పగ్గాలు అప్పగించారు.
ఇక దేశవాళీ క్రికెట్ లో సత్తాచాటిన యువ క్రికెటర్లకు జట్టులో స్థానం కల్పించారు. డబుల్ సెంచరీతో అదరగొట్టిన సంజూ శాంసన్, ముంబై ఆల్ రౌండర్ శివమ్ దూబేలను ఎంపిక చేశారు. ఇక టీ20 జట్టులో కొనసాగుతున్న నవదీప్ శైనికి ఉద్వాసన పలికారు.ఇతడి స్థానంలో శార్ధూల్ ఠాకూర్ ను ఎంపిక చేశారు. చాహల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.