Begin typing your search above and press return to search.
సస్పెన్షన్ ఎఫెక్ట్.. పాండ్యా, రాహుల్ తిరుగు ప్రయాణం
By: Tupaki Desk | 12 Jan 2019 5:23 AM GMTబాలీవుడ్ లోని ఓ ప్రఖ్యాత టీవీ చానెల్ లో ప్రసారమయ్యే ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో నోరుజారి భారత క్రికెటర్లు చిక్కుల్లో పడ్డారు. అటు కెరీర్ ను, ఇటు ఇమేజ్ ను ప్రశ్నార్థకంగా చేసుకున్నారు. మహిళల పట్ల వీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో బీసీసీఐ వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ కారణంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వీరిద్దరూ భారత్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఇద్దరిపై విచారణ చేస్తామని.. భారత్ కు తిరిగి వచ్చాక విచారణ పూర్తయ్యే వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది.
సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలి వన్డే నుంచి కూడా వీరిద్దరిని ఇప్పటికే బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా తొలగించింది. విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ కొనసాగుతుందని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ స్సష్టం చేశారు.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యాతగా సాగుతున్న ‘కాఫీ విత్ కరణ్’ షో ఎంతో పాపులర్.ఈ షోకు తాజాగా భారత క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ లు వెళ్లారు. కేఎల్ రాహుల్ తన వ్యక్తిగత జీవితాలను ఆచితూచి చెప్పగా.. పాండ్యా మాత్రం రెచ్చిపోయాడు. తాను ఎంత మందితో శృంగారం చేసిందని.. మహిళలను పబ్బుల్లో, పార్టీల్లో ఎలా చేసింది చెప్పుకొచ్చాడు. అమ్మాయిలను ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడారు.
ఇక కేఎల్ రాహుల్ సైతం పార్టీలు, పబ్బులకు వెళ్లినప్పుడు తన జేబులో కండోమ్ ప్యాకెట్ ఉంటుందని.. తన తండ్రి కూడా రక్షణ కోసం తప్పదంటూ చెప్పాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ క్రికెట్ కు ప్రాతినిధ్యం వహిస్తూ ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఈ షో ప్రసారం కాగానే పాండ్య ట్విట్టర్ ద్వారా క్షమాపణ చెప్పగా.. రాహుల్ స్పందించలేదు.
పాండ్య, రాహుల్ లపై ఇప్పటికే బీసీసీఐ పాలకమండలి సభ్యుడు వినోద్ రాయ్ రెండు వన్డేల నిషేధం విధించగా.. కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం న్యాయపరమైన సలహా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు.
ఇక పాండ్యా, రాహుల్ చేసిన వ్యాఖ్యలను టీమిండియా కెప్టెన్ కోహ్లీ కూడా తప్పుపట్టారు. టీమిండియా వారిని సమర్ధించదని.. తప్పుగా మాట్లాడిన వారు పర్యవసనాలు అర్థం చేసుకోవాలన్నారు. భారత క్రికెట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు బాధ్యతగా మెలగాలని జట్టుకు వారి వ్యాఖ్యలు ఆపాదించవద్దని కోహ్లీ హితవు పలికారు.