Begin typing your search above and press return to search.

ఐపీఎల్ జట్లు మొత్తం ముంబయికి వచ్చే డేట్ చెప్పేశారు

By:  Tupaki Desk   |   3 March 2022 3:30 PM GMT
ఐపీఎల్ జట్లు మొత్తం ముంబయికి వచ్చే డేట్ చెప్పేశారు
X
మరో క్రికెట్ పండుక్కి తెర లేవనుంది. నిజానికి క్రికెట్ ను అమితంగా ప్రేమించే వారంతా ఐపీఎల్ టోర్నీని అంతలా అలా అభిమానిస్తారు? ఆరాధిస్తారు? అన్నది ఎంతలా బుర్ర బద్ధలు కొట్టుకున్నాఅర్థం కాదు. ఎందుకంటే.. మన గల్లీలో ఆడే క్రికెట్ మ్యాచ్ కంటే కూడా ఘోరం. మన గల్లీలో ఆడే క్రికెట్ మ్యాచ్ లో.. మన గల్లీకి.. పక్క గల్లీకి పోటీ ఉంటుంది. ఒక ఉద్వేగం ఉంటుంది. కానీ.. ఐపీఎల్ లో అలాంటివేమీ ఉండవు.

అంతదాకా ఎందుకు ఐపీఎల్ లో ఉన్న జట్ల యజమానుల సంగతే చూస్తే.. అది కూడా లాజిక్ కుఅందని రీతిలో ఉంటుంది. హైదరాబాద్ జట్టు యజమాని చెన్నైకి చెందిన వాడు. అంతేకాదు.. ఒక జట్టు యజమాని.. జట్టు కెప్టెన్ సైతం.. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి ఏ మాత్రం సంబంధం లేని వారే అయి ఉంటారు. ఇలా అర్థం పర్థం లేని లెక్కలతో ఆడే ఐపీఎల్ టోర్నీకి భారీ ఆదరణ లభించటం చూస్తే.. క్రికెట్టా మజాకానా? అన్న భావన కలుగక మానదు.

తాజాగా మరో టోర్నీకి తెర లేవనుంది. ఐపీఎల్ 15వ ఎడిషన్ మరో పాతిక రోజుల్లో మొదలు కానుంది. మార్చి 26న మొదలయ్యే ఐపీఎల్ తాజా సీజన్ లో మొత్తం పది జట్లు.. 70 మ్యాచ్ లు జరగనున్నాయి. 55 మ్యాచులు ముంబయిలోని వాంఖడే స్టేడియంతో పాటు బ్రబౌర్న్.. డివై పాటిల్ స్టేడియాల్లో జరుగుతాయి. మిగిలిన 15 మ్యాచులు ఫూణెలోని ఎంసీఏ స్టేడియంలో నిర్వహిస్తారు.

ఈ నేపథ్యంలో జట్లు.. జట్ల సభ్యులంతా మార్చి ఎనిమిదో తేదీ నాటికి ముంబయికి చేరుకోవాలని బీసీసీఐ కోరింది. క్రికెట్ జట్ల సభ్యులు.. కోచింగ్.. సహాయక సిబ్బంది.. ఫ్రాంచైజీల ప్రతినిధులు అందరూ ముంబయికి చేరుకోవాల్సి ఉంటుంది. భారత్ లో ఉన్న వారైతే మూడు రోజులు.. విదేశాల నుంచి వచ్చిన వారైతే ఐదు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది.

ముంబయికి వచ్చి రిపోర్టు చేయటానికి 48 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. సో.. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ టోర్నీ షురూ కానుందన్న మాట.