Begin typing your search above and press return to search.

టీబీ టీకా.. కరోనాకూ పనిచేస్తుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి

By:  Tupaki Desk   |   15 Oct 2020 12:30 AM GMT
టీబీ టీకా.. కరోనాకూ పనిచేస్తుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి
X
కరోనా లాగే ఒకప్పడు టీబీ (క్షయ) మహమ్మారి కూడా యావత్​ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. టీబీ సోకి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడక్కడా కొంతమంది టీబీ బారినపడుతున్నారు. ప్రస్తుతం టీబీకి కచ్చితమైన చికిత్సతో పాటు వ్యాక్సిన్​ కూడా అందుబాటులో ఉంది. అయితే టీబీ నివారణ కోసం ఇచ్చే బీసీజీ టీకా.. కోవిడ్​ -19 నుంచి కూడా కాపాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. 1920ల్లో అభివృద్ధి చేసిన బీసీజీ వ్యాక్సిన్​ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ విషయంపై బ్రిటన్​లో పరిశోధనలు కూడా సాగుతున్నాయి. యూనివర్సిటీ ఎక్స్‌టెర్ దాదాపు వెయ్యి మంది వలంటీర్లకు ప్రస్తుతం టీబీ వ్యాక్సిన్​ ఇచ్చింది. బ్రిటన్‌లో లక్షల మందికి చిన్నప్పుడే బీసీజీ టీకా ఎక్కించారు. అయితే ఇప్పుడు కరోనావైరస్‌ నుంచి రక్షణలో భాగంగా వారికి మరోసారి టీకా ఇస్తున్నారు. సాధారణంగా టీకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గతంలో టీబీ వ్యాక్సిన్​ ఇతర వ్యాధులను కూడా తగ్గించింది. గినియోబిసావులో టీబీ వ్యాక్సిన్​ వల్ల 38 శాతం శిశుమరణాలను తగ్గించగలిగామని వైద్య నిపుణులు చెబుతున్నారు. న్యుమోనియా, సెప్సిస్ వ్యాధులను ఈ టీకా తగ్గించగలిగింది.

టీబీ వ్యాక్సిన్​ కరోనా వ్యాధిని 100 శాతం అరికడుతుందని చెప్పలేం. కానీ ఈ కరోనాకు వ్యాక్సిన్​ వచ్చే వరకు ఈ టీకా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, స్పెయిన్, బ్రెజిల్‌ లో కూడా ఈ విషయంపై అధ్యయనం సాగుతున్నది.

చిన్నప్పుడు బీసీజీ వ్యాక్సీన్ తీసుకున్నా రక్షణ లేని వారు మరోసారి టీకా తీసుకున్నా కోవిడ్-19 నుంచి అంత రక్షణ ఉండకపోవచ్చు. అయితే, 2005 తర్వాత బ్రిటన్‌లో క్షయ కేసులు బాగా తగ్గిపోవడంతో ఈ టీకాను ఇవ్వడం చాలావరకు తగ్గించారు. దీంతో ఇప్పుడు మళ్లీ టీబీ వ్యాక్సినేషన్​ పెంచారు.