Begin typing your search above and press return to search.
ఆశ్చర్యం.. 24,000 ఏళ్ల కిందట గడ్డకట్టిన జీవికి ఇప్పుడు ప్రాణం!
By: Tupaki Desk | 11 Jun 2021 6:30 AM GMTసైబీరియాలోని ఆర్కిటిక్ పెర్మాఫ్రోస్ట్ సరస్సులో ఓ అద్భుతం జరిగింది. గడ్డకట్టుకుపోయిన ఈ సరస్సులో ఓ జీవి ప్రాణంతో బయటపడింది. 24,000 ఏళ్ల కిందట గడ్డకట్టుకుపోయిన డెల్లాయిడ్ రాటిఫర్ అనే జీవికి ఇప్పుడు ప్రాణం వచ్చింది. దీనిని మైక్రోస్కోప్ ద్వారానే చూడగలం. ఈ జీవి ప్రస్తుతం ప్రాణంతో ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జీవి చూడడానికి జలగలా ఉంటుంది.
24 వేళ ఏళ్లపాటు ఘనీభవించిన స్థితిలో ఉన్న ఈ జీవికి ప్రస్తుతం ప్రాణం వచ్చింది. దాని చుట్టూ ఉన్న మంచు కరిగి ఊపిరి పోసుకుంది. ప్రత్యుత్పత్తిని ప్రారంభించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జీవిలో ఆడజాతి మాత్రమే ఉంటాయి. వాటిలోని అండాల సాయంతో ప్రత్యుత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. మగజాతి జీవులు అవసరం లేదని వెల్లడించారు.
ఇవి గడ్డకట్టుకుపోయి వేల సంవత్సరాలు బతికే ఉంటాయని తెలిపారు. ఈ జీవి ప్రస్తుత వయసు 24,485 ఏళ్లు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఈ జీవి మనుగడ సాధించగలదని వెల్లడించారు. ఏళ్ల తరబడి ఆకలి, డీహైడ్రేషన్ ను తట్టుకోగలవని స్పష్టం చేశారు.
రాటిఫర్ అనగా చక్రాలు గల అర్థంతో కూడిన లాటిన్ భాష నుంచి వచ్చింది. డెల్లాయిడ్ రాటిఫర్ జీవి మంచినీటి సరస్సులు, చెరువుల్లో జీవిస్తుంది. బహుళ కణ జీవి ఇది. దీనిలో వేల కణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు వివరించారు. అందుకే 24,000 ఏళ్లు గడ్డకట్టినా ఇది ప్రాణంతో ఉంది.