Begin typing your search above and press return to search.
బాబర్.. ఘోరీ.. గజనీ పేర్లను ఎందుకు పెడుతున్నారంటే?
By: Tupaki Desk | 3 Aug 2019 2:30 PM GMTహైదరాబాద్ లో తక్కువలో తక్కువ 1.25 కోట్ల మంది జనాభా ఉంటుంది. ఇందులో ఒకట్రెండు శాతం మందికి కూడా హైదరాబాద్ గొప్పతనం.. దాని ప్రాధాన్యత.. దాని విలక్షణత లాంటివేవీ తెలీవు. కొన్ని విషయాలు తెలిస్తే.. ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. దేశంలో ఏ మిస్సైల్ ప్రయోగించిన హైదరాబాద్ కు చెందిన బీడీఎల్ చేయి పడాల్సిందే. అంతేనా.. శాటిలైట్లను పంపే విషయంలోనూ హైదరాబాద్ కు చెందిన సంస్థలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.
నిజానికి ఒక్క బీడీఎల్ మాత్రమే కాదు.. చాలానే శాస్త్రసాంకేతిక సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి. సాధారణ ప్రజలకు వాటి గొప్పతనం గురించి.. దేశ రక్షణ రంగంలో అవెంత కీలకమన్న విషయాలు తక్కువమందికి మాత్రమే తెలుసు. తాజాగా నగరశివారులోని బీడీఎల్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.
ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్న ఆయన.. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. పెంచి పెద్దది చేశారని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించని స్పష్టం చేశారు. దాని పలితం ఈ రోజున దేశ ప్రజలంతా చూస్తున్నట్లుగా చెప్పారు. గడిచిన 50 ఏళ్లలో అన్ని రకాలు మిస్సైల్స్ ను ఉపయోగించిన వైనాన్ని గుర్తు చేశారు. ప్రపంచాన్ని భారత్ వైపు చూసేలా తయారు చేశామన్నారు. భారత సైనికులు శాంతి కోసం పని చేస్తున్నారని.. . వాటికిసృష్టికి కారణమైన పేర్లను మన మిస్సైల్స్ (పృథ్వీ- ఆకాశ్- అగ్ని- త్రిసూల్- బ్రహ్మోస్) వంటి పేర్లు పెడితే.. దాయాది పాక్ మాత్రం మనల్ని రెచ్చగొట్టేందుకు వీలుగా వారి మిస్సలైకు పెడుతున్న పేర్లను చూస్తే అర్థమైపోతుందన్నారు. వారి వద్దనున్న మిస్సైల్స్ కు పేర్లను.. చరిత్రలో సంపదను దోచుకున్న వారి పేర్లను పెట్టటం ద్వారా భారత్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నట్లు చెప్పారు. రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్సిస్తున్నాయని చెప్పక తప్పదు. చరిత్రలో ఓడించలేని దోపిడీ దారుల్ని ఆధునిక సమాజంలో అందుబాటులోని సాంకేతికతను ఉపయోగించి వాటి సంగతి చూస్తే సరి.