Begin typing your search above and press return to search.

ముంచుకొస్తున్న ఒమిక్రాన్.. 2-3 రోజుల్లో రెట్టింపు

By:  Tupaki Desk   |   29 Dec 2021 8:30 AM GMT
ముంచుకొస్తున్న ఒమిక్రాన్.. 2-3 రోజుల్లో రెట్టింపు
X
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. అగ్రదేశమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచదేశాలు ఒమిక్రాన్ కంటే ముందు వచ్చిన డెల్టా వేరియంట్ తోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

అయితే ఇప్పుడు ఒమిక్రాన్ సోకిన దేశాల్లో వైరస్ విపరీతంగా విజృంభిస్తోంది. ఇటీవల భారత్ లోకి కూడా ఈ వేరియంట్ ప్రవేశించి భారతీయులపై విరుచుకుపడుతోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులపై డబ్ల్యూ.హెచ్.వో స్పందించింది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా విజృంభిస్తోందని.. ఇప్పటికే యూకే, యూఎస్ దేశాలలో ఒమిక్రాన్ మరణాలు కూడా సంభవిస్తున్నాయని వెల్లడించింది.

డిసెంబర్ 20 నుంచి 26 వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని.. అంతేకాకుండా రానున్న 2-3 రోజుల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఇప్పటికే ఒమిక్రాన్ పై జాగ్రత్త వహించాలని దేశాలకు సూచించినట్లు సమాచారం. అయితే భారత్ లో కూడా ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. నిన్న ఒక్కరోజే 127 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గత వారం వరకూ 7వేల లోపు నమోదైన కరోనా కేసులు తాజాగా 9వేలకు పైగా నమోదయ్యాయి.