Begin typing your search above and press return to search.

ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి వచ్చేవారికీ హెచ్చరిక ..తస్మాత్ జాగ్రత్త , లేకపోతే ..?

By:  Tupaki Desk   |   10 Jun 2020 12:30 AM GMT
ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కి వచ్చేవారికీ హెచ్చరిక ..తస్మాత్ జాగ్రత్త , లేకపోతే ..?
X
లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన తరువాత తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి చికిత్స కోసం నగరంలోని హాస్పిటళ్లకు వస్తున్న వారు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల సత్తెనపల్లికి చెందిన ఓ వ్యక్తి గుండె జబ్బు కారణంగా హాస్పిటల్లో చేరగా, ఆయనకు వైరస్ సోకింది. ఆయన చనిపోగా డెబ్ బాడీని సొంతూరు తీసుకెళ్లాక అనుమానం వచ్చిన టెస్టులు చేశాక కానీ ఆయనకు వైరస్ సోకిన విషయం తెలిసింది.

అలాగే , తెలంగాణలో గ్రీన్ జోన్ జిల్లాగా ఉన్న యాదాద్రిలోని రాజాపేటకు చెందిన ఓ నిండు గర్భిణి కూడా హైదరాబాద్ ‌‌లో ప్రసవం తర్వాత చనిపోయింది. అనుమానంతో ఆమెకి వైరస్ నిర్దారణ టెస్టులు చేయగా ఆమెకు వైరస్ సోకినట్లు తేలింది. అయితే, గ్రీన్ జోన్ జిల్లాకు చెందిన ఆమెకు వైరస్ ఎలా సోకిందనే విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలా క్యాన్సర్, కిడ్నీ జబ్బులకు చికిత్స కోసం పలు జిల్లాల నుంచి వస్తోన్న చాలా మంది కూడా వైరస్ బారిన పడి చనిపోతున్నారు. వీరికి వైరస్ ఎలా సోకుతుందనే విషయంలో క్లారిటీ లేదు.

హాస్పిటల్‌లో చేరినప్పుడు వైరస్ నెగటివ్ రిపోర్ట్ వచ్చి.. మరోసారి టెస్టు చేసినప్పుడు పాజిటివ్ అని రావడంతో చికిత్స కోసం హాస్పిటళ్లలో చేరాకే వీరు ఈ మహమ్మారి బారిన పడుతున్నట్లు భావిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స కోసం హైదరాబాద్ వచ్చి.. హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిన వారికి కూడా తర్వాత వైరస్ సోకింది అని తేలుతోంది. ఈ విషయం తెలియక కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియల సమయంలో మృతదేహాలను తాకుతున్నారు. దీంతో ఇన్ఫెక్షన్ వారికి కూడా సోకే ప్రమాదం ఉంది. ఇలా వేరే వ్యాధులకు చికిత్స పొందడం కోసం హైదరాబాద్‌ లోని హాస్పిటళ్లలో చేరిన వారు వైరస్ బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అత్యవసరం అయితే తప్ప హైదరాబాద్ కి ట్రీట్మెంట్ కోసం రాకపోవడమే మంచిది ప్రస్తుత పరిస్థితుల్లో ..అలాగే హాస్పిటళ్లకు వెళ్లిన వారు సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్‌ తో తరచుగా చేతులు కడుక్కోవడం లాంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.