Begin typing your search above and press return to search.

థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి: కేసీఆర్

By:  Tupaki Desk   |   24 May 2021 4:30 PM GMT
థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి: కేసీఆర్
X
కరోనా సెకండ్ వేవ్ కష్టాలు ఇంకా తీరనే లేదు.. అప్పుడే థర్డ్ వేవ్ పై కసరత్తు మొదలుపెట్టారు సీఎం కేసీఆర్. తెలంగాణలో టెస్టులు చేయలేదని.. చికిత్సలు సరిగా లేవని హైకోర్టు ఎన్నో సార్లు కేసీఆర్ సర్కార్ ను ఎండగట్టింది. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఈసారి వైద్య ఆరోగ్యశాఖను ఈటలను తొలగించి టేకప్ చేసి తెలంగాణ వైద్యరంగాన్ని ప్రక్షాళన చేసేస్తున్నారు. వైద్యరంగంలో స్పీడ్ పెంచారు. పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళుతున్నట్టు అర్థమవుతోంది.

సెకండ్ వేవ్ వేళ తెలంగాణలో కఠిన లాక్ డౌన్ పెట్టి కట్టడి చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు రాబోయే ఉపద్రవంపై పడ్డారు. థర్డ్ వేవ్ పై కసరత్తు మొదలుపెట్టారు.కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కేసీఆర్.. ప్రజల ఆరోగ్యం కోసమే లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు.

రెండో డోసుకు సరిపడా టీకాలను సమకూర్చుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. బ్లాక్ ఫంగస్ కు అవసరమైన మందులు సమకూర్చుకోవాలని ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు గాంధీలో 150, ఈఎన్టీ ఆస్పత్రిలో 250 బెడ్లు కేటాయిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు.

మొత్తంగా మూడో వేవ్ కు ముందే కేసీఆర్ అప్రమత్తపై పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రణాళికలు ఏమేరకు పనిచేస్తాయో చూడాలి.