Begin typing your search above and press return to search.
గుర్తు పట్టలేని రీతిలో మారిపోయిన మాజీ సీఎం
By: Tupaki Desk | 26 Jan 2020 4:32 AM GMTక్లీన్ షేవ్ లో కనిపించే జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. తాజాగా ఏ మాత్రం గుర్తు పట్టలేని రీతిలో మారిపోయిన వైనం ఇప్పుడు వైరల్ గా మారింది. జమ్ముకశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370ను మార్చేసిన తర్వాత హౌస్ అరెస్టులోకి వెళ్లిపోయిన ఆయనకు సంబంధించిన వార్తలు పెద్దగా రావటం లేదు. దీనికి భిన్నంగా తాజాగా ఒక కశ్మీరీ జర్నలిస్టు ఒమర్ అబ్దుల్లా తాజా ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయటం ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.
తన రెగ్యులర్ ఆహార్యానికి భిన్నంగా గుబురు మీసాలతో.. భారీగా పెరిగిన గడ్డంతో ఉన్న ఆయన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. తలకు మంకీ క్యాప్.. నీలం రంగు కోటులో కురుస్తున్న మంచు మధ్యలో చిరునవ్వులు చిందిస్తున్న ఒమర్.. రూపం చూసినంతనే ఆయన్ను ఏ మాత్రం పోల్చుకోని రీతిలో మారిపోయారని చెప్పాలి.
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి శ్రీనగర్ లోని హరి నివాస్ లో ఆయన్ను హౌస్ అరెస్టు చేసి ఉంచారు. ఇటీవలే ఆయన్ను పట్టణంలోని గుప్కార్ రోడ్డులో ఉన్న ఎం4 ప్రభుత్వ బంగ్లాకు మార్చారు. తన రోటీన్ రూపానికి భిన్నంగా భారీగా గడ్డాన్ని.. మీసాల్ని పెంచటం వెనుక లెక్క ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మోడీ సర్కారు తీరుకు నిరసనగానే ఆయనీ రూపంలోకి దిగినట్లుగా కొందరు చెబుతున్నారు. అందులో నిజం ఎంతన్నది తేలాలంటే.. ఆయన బయటకు వచ్చి మాట్లాడితే కానీ క్లారిటీ రాదని చెప్పక తప్పదు.