Begin typing your search above and press return to search.
చపాతీ కర్రతో బాదేస్తోంది... న్యాయం చేయండి: భార్యపై భర్త ఫిర్యాదు!
By: Tupaki Desk | 29 Dec 2022 11:30 PM GMTభార్యాభర్తల మధ్య వివాదాలు మామూలే. అంతేకాదు.. వైవాహిక జీవితంలో భర్త తనను కొట్టాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. మన కళ్ల ముందు కూడా అనేకం కనిపిస్తున్నాయి. అయితే బిహార్ గోపాల్గంజ్లో ఇందుకు భిన్నమైన ఘటన జరిగింది.
భార్య తనను చపాతీ కర్రతో బాదేస్తోందని.. ఇలా ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఎప్పుడు పడితే అప్పుడు కొడుతోందని.. ఓ భర్త ఏకంగా పోలీస్టేషన్ గడప తొక్కాడు. తనకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరయ్యాడు. అంతేకాదు.. భార్య తనను పదే పదే కొడుతున్న చపాతీ కర్రను కూడా సాక్ష్యంగా తీసుకెళ్లాడు. అంతేకాదు.. అదే కర్రతో తనను చంపేస్తానని కూడా బెదిరిస్తోదన్నాడు. దీంతో అవాక్కయిన పోలీసులు.. ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నారు.
బిహార్‌కు చెందిన బాధితుడు శశికుమార్ సిద్వాలియా రైల్వే స్టేషన్‌లో పని చేస్తున్నాడు. ఆఫీసుకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో శశికుమార్.. పిల్లల విషయంలో తన భార్యతో గొడవపడ్డాడు. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తురాలైన అతని భార్య రోటీ కర్రతో శశికుమార్ తలపైన కొట్టింది. దీంతో ఆయన తలపై తీవ్ర గాయమైంది.
వెంటనే మహిళా పోలీసు స్టేషన్కు చేరుకున్న శశికుమార్.. భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. "నేను ఉదయం ఆఫీసుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నా. నేను ఇంటి నుంచి బయలుదేరుతుండగా.. నా భార్యతో నాకు గొడవ జరిగింది. ఆమె నా తలపై రోటీ కర్రతో కొట్టడం వల్ల నా తలకు గాయమైంది" అని బాధితుడు పోలీసులతో చెప్పాడు. రోటీ కర్రను పోలీసులకు చూపించాడు. దీనిపై ఏం చేయాలో ఆలోచించి చెబుతామని.. పోలీసులు అప్పటికి ఆయనను పంపించేశారు. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.