Begin typing your search above and press return to search.
బ్యూటిషియన్ బాయ్ ఫ్రెండ్ ఇలా శవమయ్యాడు
By: Tupaki Desk | 26 Aug 2018 3:57 PM GMTసంచలనం సృష్టించిన విజయవాడలో బ్యుటీషియన్ పై హత్యాయత్నం కేసు అనూహ్య మలుపు తిరిగింది.ఒంటిపై దుస్తులు తొలగించి.. కాళ్లు కట్టేసి - చేతులు నరికి - మెడపై కోసి పాశవికంగా హింసించి ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే హత్య చేసిన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరానికి చెందిన పల్లె పద్మ హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యూటీ పార్లర్ లో పనిచేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త సూర్యనారాయణతో విభేదించి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఏలూరుకు చెందిన బత్తుల నూతన్ కుమార్ విక్టర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ స్థానిక తారకరామ కాలనీ సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తుండగా...ఆమె ప్రియుడే ఈ దారుణానికి ఒడిగిట్టిన సంగతి తెలిసిందే.
అలా బాధకరమైన పరిస్థితిని ఎదుర్కున్న బ్యుటీషియన్ పద్మ ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పద్మతో అక్రమ సంబంధం పెట్టుకున్న నూతన కుమార్ విక్టర్ హత్యాయత్నం చేశాడా లేక ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కలకలం రేగింది. పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో నిందితుడు నూతన్ విక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు నుంచి నరసరావుపేట వెళ్లే మార్గంలో రైల్ పట్టాలపై నూతన్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో బ్యూటీషియన్ పద్మ కేసు ఆమె ఇచ్చే వాంగ్మూలం మీదే ఆధారపడి ఉండనుంది.
తన భర్తతో విభేధించిన పద్మ ఏలూరుకు చెందిన బత్తుల నూతన్ కుమార్ విక్టర్ తో ఆమెకు పరిచయం ఏర్పడి అది సహజీవనానికి దారితీసి తారకరామ కాలనీ సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే, రెండు రోజుల కిందట పద్మ - నూతన్ కుమార్ ల మధ్య గొడవ జరిగింది. ఈ తర్వాత పద్మ ఫోన్ స్విచాఫ్ రావటంతో అనుమానం వచ్చిన పద్మ కుమార్తె... తన తండ్రి సూర్యనారాయణకు ఈ విషయం చెప్పింది. దీంతో శనివారం ఉదయం సూర్యనారాయణ ఆమె ఇంటికి వెళ్లాడు. బయట నుంచి పిలవగా ఎవరూ పలకపోవడం - తలుపులు తీసి ఉండటంతో ఇంటి లోపలికి వెళ్లిన సూర్యనారాయణ అక్కడి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాడు. కాళ్లు కట్టేసి - రెండు చేతులు తెగిపోయి - ఒంటిపై బట్టలు లేకుండా పద్మ పడి ఉండటాన్ని గుర్తించి.. వెంటనే హనుమాన్ జంక్షన్ పోలీసులకు సమాచారం అందజేయగా వారు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో విక్టర్ ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది.