Begin typing your search above and press return to search.
బ్యూటీషియన్ శిరీష డెత్ మిస్టరీ
By: Tupaki Desk | 16 Jun 2017 11:45 AM GMTరాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శిరీష కేసును పోలీసులు ఛేదించారు. శిరీషది ఆత్మహత్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఏ-1 శ్రావణ్ - ఏ-2 రాజీవ్ లను నిందితులుగా చేర్చారు. శుక్రవారం మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీపీ మహేందర్ రెడ్డి మీడియాకు వివరించిన శిరీష కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి....
రాజీవ్ - శిరీషల మధ్య అక్రమ సంబంధం ఉంది. మరోవైపు బెంగళూరులో పనిచేస్తున్న తేజస్వినితో రాజీవ్ కు ప్రేమ వ్యవహారం నడుస్తోంది. మూడు నెలల క్రితం తేజస్విని హైదరాబాద్ కు బదిలీపై వచ్చింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే, రాజీవ్ - శిరీషల అక్రమ సంబంధం గురించి తేజస్వినికి తెలిసింది. మే 30న రాజీవ్ స్టుడియోలో శిరీష - తేజస్విని మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారి ఘర్షణ పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ విషయం గురించి శిరీష తనకు తెలిసిన శ్రావణ్ కుమార్ కు చెప్పింది
శ్రావణ్ తనకు తెలిసిన కుకునూరుపల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డిని సమస్య పరిష్కరించమని కోరాడు. జూన్ 12న రాజీవ్ - శ్రవణ్ - శిరీష కుకునూర్ పల్లికి కారులో బయలుదేరారు. రాత్రి 11.30 గంటల నుంచి 2.30 గంటల వరకు కుకునూర్ పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్ లోనే వీరంతా గడిపారు. నలుగురూ కలిసి మద్యం తాగిన తర్వాత ఎస్ ఐ - రాజీవ్ - శ్రవణ్ కొద్దిసేపు బయటకు వెళ్లారు.
బయట ఎస్ ఐ వారితో మాట్లాడుతూ.. రాజీవ్ - శ్రావణ్ లను ప్రాస్టిట్యూట్స్ వద్దకు వెళ్లాలని సూచించారు. వారి మాటలు విన్న శిరీష భయపడి తన లోకేషన్ ను భర్త ఫోన్ కు పంపించింది. ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి గదిలోకి వెళ్లిన కాసేపటికే శిరీష గట్టిగా కేకలు వేసింది. రాజీవ్ - శ్రావణ్ లోపలకు వచ్చేసరికి గదిలో ఓ పక్కన భయభయంగా వణికిపోతూ కనిపించింది. నన్నేమీ చేయొద్దని కేకలు వేస్తోంది.
ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా శిరీష అరుస్తుండడంతో రాజీవ్ ఆమెను కొట్టాడు. గొడవ పెరుగుతుండడంతో ఎస్ ఐ సలహా మేరకు రాజీవ్ - శ్రవణ్ - శిరీష అక్కడి నుంచి వెళ్లిపోయారు. మార్గమధ్యంలో శిరీష కారు డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. శిరీషను పట్టుకునే క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. వీరు ప్రయాణంలో ఉండగానే రాజీవ్ కు ఎస్ ఐ రెండుసార్లు ఫోన్ చేశారు.
ముగ్గురూ షేక్ పేట్ కు చేరుకున్న వెంటనే శిరీష నేరుగా స్టూడియో గదిలోకి వెళ్లిపోయింది. రాజీవ్ - శ్రవణ్ కిందే ఉండిపోయారు.తర్వాత శ్రవణ్ ను ఇంటికి పంపించేందుకు రాజీవ్ క్యాబ్ బుక్ చేశాడు. తర్వాత ఫ్లాట్ కు వెళ్లి డోర్ ఓపెన్ చేయగా శిరీష ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. వెంటనే అంబులెన్స్ కోసం 100కు ఫోన్ చేశాడు. కత్తితో చున్నీ కట్ చేసి మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టాడు. ఈలోగా శ్రవణ్ తిరిగి రావడంతో ఇద్దరూ కలిసి శిరీషను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/