Begin typing your search above and press return to search.
బ్యూటీషియన్ శిరీష డెత్ మిస్టరీ..ఫోరెన్సిక్ రిపోర్ట్!
By: Tupaki Desk | 7 July 2017 9:30 AM GMTరాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన బ్యూటీషియన్ శిరీష కేసులో మరో కీలకమైన విషయం వెల్లడైంది. ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న విషయాన్ని తెలియజేసే ఫోరెన్సిక్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. శిరీషపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. శిరీష మృతి కేసుకు సంబంధించి తమకు ఫోరెన్సిక్ నివేదిక అందినట్లు డీసీపీ చెప్పారు.
అయితే, శిరీషపై ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచారం చేయలేదని ఆయన తెలిపారు. ఆమెపై అతడు అత్యాచారయత్నం చేసినట్లు తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. విస్రా పరీక్షలో శిరీష మద్యం సేవించి ఉన్నట్లు తేలిందన్నారు. శిరీష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వైద్యుల నివేదికలో వెల్లడైందని ఆయన చెప్పారు.
శిరీష దుస్తులపై ఉన్న మరకలు అత్యాచారానికి సంబంధించినవి కావని, ఆహార పదార్థాల మరకలని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైనట్లు డీసీపీ తెలిపారు. శిరీష మృతిపై ఎవరికి ఎటువంటి అనుమానాలున్నా నివృత్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లు సాంకేతిక పరమైన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. వాటిని కోర్టుకు సమర్పిస్తామని డీసీపీ తెలిపారు. శిరీష మృతికి కారణమైన నిందితులకు తప్పకుండా శిక్ష పడేలా చేస్తామన్నారు.