Begin typing your search above and press return to search.

శిరీష బాబాయ్ మాట‌లు రేపుతున్న కొత్త క్వ‌శ్చ‌న్లు

By:  Tupaki Desk   |   22 Jun 2017 4:39 AM GMT
శిరీష బాబాయ్ మాట‌లు రేపుతున్న కొత్త క్వ‌శ్చ‌న్లు
X
బ్యూటీషియ‌న్ శిరీష మృతి కేసు ఎంత సంచ‌ల‌నం రేపుతుందో తెలిసిందే. ఇప్ప‌టికే ఆమె మృతి విష‌యంపై పోలీసులు వివ‌రంగా.. సుదీర్ఘంగా.. ఒక క‌థ చెప్పిన‌ట్లుగా ఆమె ఏ విధంగా సూసైడ్ చేసుకుంద‌న్న విష‌యాన్ని చెప్ప‌టం తెలిసిందే. పోలీసుల వెర్ష‌న్ విన్న త‌ర్వాత శిరీష ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌న్న మాట‌ను అంద‌రూ నమ్మే ప‌రిస్థితి. ఇదిలా ఉండ‌గా.. శిరీష చిన్న‌ప్పుడు బెంగ‌ళూరులో ఆమె బాబాయ్ ద‌గ్గ‌ర పెరిగింది. ఇప్పుడాయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చి.. శిరీష మృతి మీద ప‌లు సందేహాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న లేవ‌నెత్తుతున్న సందేహాలు విన్న‌ప్పుడు శిరీష మ‌ర‌ణం మీద స‌రికొత్త అనుమానాలు వ‌చ్చేలా ఉన్నాయి. శిరీష బాబాయ్ మాట్లాడుతూ.. శిరీష క్యారెక్ట‌ర్ ను బ్యాడ్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని.. అస‌లు నిజాల్ని దాచేస్తున్నార‌న్న సందేహాల్ని ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

పోలీసుల వెర్ష‌న్‌పై కొత్త డౌట్లు క‌లిగేలా ఆయ‌న వాద‌న ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆయ‌న లేవ‌నెత్తుతున్న ప్ర‌శ్న‌లు విన్న‌ప్పుడు శిరీష మృతి విష‌యంలో పోలీసులు కొన్ని కోణాల్ని మిస్ అయ్యారా? అన్న భావ‌న క‌ల‌గ‌టంతో పాటు.. ఆమెది హ‌త్యేన‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇంత‌కీ శిరీష బాబాయ్ లేవ‌నెత్తిన కొత్త సందేహాలు ఏమిట‌న్న‌ది చూస్తే..

1. అర్థ‌రాత్రి 1.58 గంట‌ల‌కు శిరీష త‌న భ‌ర్త‌కు వాట్స‌ప్ లో లొకేష‌న్ షేర్ చేసింద‌ని పోలీసులు చెప్పారు. మ‌రి.. అదే నిజ‌మైతే.. కుకునూరుప‌ల్లి క్వార్ట‌ర్స్‌ను చూపించాలే కానీ.. అక్క‌డ‌కు నాలుగు కిలోమీట‌ర్లు దూరంలో ఉన్న లొకేష‌న్ చూపించ‌టం ఏమిటి?

2. అస‌లు శిరీష పోలీస్ క్వార్ట‌ర్‌కు వెళ్లిందా?

3. శిరీష అండ్ బ్యాచ్ క్వార్ట‌ర్స్‌కు వెళ్ల‌లేదు.. వీరంతా ఒక రిసార్ట్స్ లో క‌లిసి ఉన్నారు .

4. శిరీష నెత్తి మీద ఉన్న గాయం.. జుట్టు ప‌ట్టుకొని లాగ‌టం ఎంత‌మాత్రం కాదు. బ‌లంగా కొట్ట‌టం వ‌ల్లే అయి ఉంటుంది. ఎందుకంటే శిరీష వారి నుంచి త‌ప్పించుకునేందుకు కారు దిగి పారిపోయి ఉంటుంది. ఈ క్ర‌మంలో ఎక్క‌డో చెట్టు కింద ఉండి త‌న లొకేష‌న్‌ను భ‌ర్త‌కు షేర్ చేసింది. అయితే.. పారిపోయిన శిరీష‌ను ప‌ట్టుకొని బ‌లంగా కొట్టి చంపేసి ఉంటారు. ఆ త‌ర్వాత రాజీవ్‌.. శ్ర‌వ‌ణ్‌.. ఎస్ ఐ ప్ర‌భాక‌ర్ రెడ్డిలు క‌లిసి డ్రామా ఆడిఉంటారు

5. అపార్ట్ మెంట్‌లోకి వెళ్లి శిరీష ఉరి వేసుకొంద‌ని చెబుతున్నారు. శిరీష ఎత్తు 5.11 అడుగులు. ఈ లెక్క‌న రూమ్ లో కాట్ ఎత్తు.. ఫ్యాన్ ఎత్తు ప‌రిశీలిస్తే.. ఉరి వేసుకునే అవ‌కాశ‌మే లేదు.

6. శిరీష‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన సీసీ పుటేజ్ దొర‌క్క‌పోవ‌టం ఏమిటి?

7. కుకునూరు ఎస్ ఐ ద‌గ్గ‌ర సెటిల్ మెంట్ కోసం వెళ్లార‌ని చెబుతున్నారు క‌దా? అస‌లు.. ఆ సెటిల్ మెంట్ ఏమిటి?

8. చిన్న‌ప్పుడు నా ద‌గ్గ‌రే శిరీష పెరిగింది. త‌ను ఫైర్ బ్రాండ్‌. ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికిదికాదు. చాలా ధైర్య‌వంతురాలు. ఎదిరించి బ‌తికే మ‌న‌స్త‌త్వం ఆమెది. అలాంటి ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం ఏమిటి?