Begin typing your search above and press return to search.
అందమైన లొకేషన్లు యుద్ధంలో బూడిదేనా?
By: Tupaki Desk | 25 Feb 2022 3:07 AM GMTఅగ్రరాజ్యం రష్యా యుద్ధోన్మాదానికి ఉక్రెయిన్ తీవ్ర ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. రష్యా దాడులతో ఇప్పటికే పలువురు సైనికులు.. 137 మంది ప్రజలు చనిపోయినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. పొరుగు దేశాలతో రష్యా శత్రుత్వం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. అయితే రష్యా- ఉక్రెయన్ మధ్య గొడవను సద్ధుమణిగేలా చేసేందుకు భారత్ తనవంతు ప్రయత్నాల్లో ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంత ప్రముఖంగా హెడ్ లైన్స్ లోకి వచ్చిన ఉక్రెయిన్ తో సినీపరిశ్రమల అనుబంధం పరిశీలిస్తే చాలా విశేషాలున్నాయి.
ఉక్రెయిన్ లొకేషన్ల విషయంలో భారతీయ సినీపరిశ్రమకు విపరీతమైన క్యూరియాసిటీ ఉంది. ఇక్కడ అందమైన లొకేషన్లలో మన సినిమాలెన్నో తెరకెక్కుతున్నాయి. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన నాటు నాటు సాంగ్ ని ఉక్రెయిన్ లో తెరకెక్కించారు. అక్కడ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు చాలా కాలం అక్కడే ఉంది టీమ్.
కేవలం ఆర్.ఆర్.ఆర్ మాత్రమే కాదు.. అంతకుముందు పలు తెలుగు చిత్రాల్ని ఉక్రెయిన్ లో తెరకెక్కించారు. సాయిధరమ్ నటించిన విన్నర్ చిత్రీకరణ కోసం ఉక్రెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని పాటలు సన్నివేశాలు తెరకెక్కించారు. అంతకుముందు రజనీకాంత్ - శంకర్ కాంబినేషన్ మూవీ 2.0 ని ఉక్రెయిన్ లో కొంత భాగం తెరకెక్కించారు.
కార్తీ నటించిన దేవ్.. ఏ.ఆర్.రెహమాన్ నిర్మించిన 99 సాంగ్స్ సినిమాల షూటింగుల్ని ఉక్రెయిన్ లో తెరకెక్కించారు. ఇక హిందీ పరిశ్రమ నుంచి పలు సినిమాల షూటింగులు ఉక్రెయిన్ లో జరిగాయి. ఇప్పుడు యుద్ధం వల్ల అందమైన ఉక్రెయిన్ లొకేషన్లన్నీ బూడిదగా మారనున్నాయన్న ఆందోళన నెలకొంది.