Begin typing your search above and press return to search.

ట్విట్టర్ ఆఫీసులో 'పడక' గదులు.. వైరలవుతున్న పిక్స్..!

By:  Tupaki Desk   |   9 Dec 2022 12:30 PM GMT
ట్విట్టర్ ఆఫీసులో పడక గదులు.. వైరలవుతున్న పిక్స్..!
X
ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి పలు సంచనాల నిర్ణయాలకు కేరాఫ్ గా మారుతున్నారు. ట్విట్టర్లోని ఉన్నతోద్యోగుల నుంచి కింది స్థాయి వరకు అనేక మందికి ఇప్పటికే ఇంటికి పంపించి మాస్క్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. అయితే శాన్ ఫ్రాన్సిస్కోలోని హెడ్ ఆఫీసును ఉద్యోగుల కోసం హోటల్ గదిలా మార్చివేయడం మీడియా దృష్టికి వచ్చింది.

ట్విట్టర్ నుంచి వేలాది మందికి ఉద్వాసన పలికిన నేపథ్యంలోనే ఎలాన్ మాస్క్ తక్కువ మంది ఎక్కువ పని చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఉద్యోగులు పనితో అలిసి పోయినప్పుడు ఇంటికి వెళ్లకుండా ఆఫీసులోని నిద్రించేలా పడక గదులను సైతం ఏర్పాటు చేశారనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఎలాన్ మాస్క్ మాత్రం ట్విట్టర్లో కొత్త కల్చర్ కు తెరలేపినట్లు కన్పిస్తోంది. ఇందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో ట్విట్టర్ హెడ్ ఆఫీసులోని కొన్ని గదులను హోటల్ గదులా మాదిరిగానే మార్చివేశారు. ఒక్కో ఆఫీస్ గదిలో బెడ్స్.. కర్టెన్స్.. కాన్ఫరెన్స్ రూమ్.. టెలి ప్రెజర్స్ మానిటర్లు వంటి సదుపాయాలున్నాయి.

పడక గదులను తలపించేలా ఉన్న ఈ గదుల్లో ఒక్క టేబుల్.. సోఫా క్వీన్ బెడ్.. టేబుల్ ల్యాంప్.. వాషింగ్ మిషన్.. రెండు ఆఫీస్ ఆర్మ్ ఛైర్లు ఉన్నాయి. ఈ గదులను చూస్తుంటే ఫైవ్ స్టార్ హోటల్ గదులను తలపించేలా ఉండటం విశేషం. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవడానికి వీటిని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది.

ట్విట్టర్ ఆఫీసులోని పడక గదులకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఈ నేపథ్యంలోనే మీడియాలోనూ ఈ కొత్త కల్చర్ పై కథనాలు ప్రసారమయ్యారు. అయితే శానిఫ్రాన్సిస్కో లోని ట్విట్టర్ కార్యాలయం కేవలం వాణిజ్య అవసరాల కోసం మాత్రమే పర్మిషన్ తీసుకుందనే విషయం వెలుగులోకి వచ్చింది.

కానీ ట్విట్టర్ ఆఫీస్ లో వాణిజ్య అవసరాల కోసం కాకుండా హోటల్ గదుల మార్చారనే ప్రచారం నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఇన్‌స్పెక్షన్ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ భవనం దేని కోసం ఉపయోగించ బడుతుందో తాము నిర్ధారించుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని శాన్ ఫ్రాన్సిస్కో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఇన్‌స్పెక్షన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పాట్రిక్ హన్నన్ తెలిపారు. కాగా ఎలాన్ మాస్క్ చేపట్టిన ఈ చర్యలపై మాత్రం నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.