Begin typing your search above and press return to search.
అన్నాదమ్ములు పార్టీలు వేరైనా.. వైసీపీ ఎమ్మెల్యేను ఇరుకున పెడుతున్నారా?
By: Tupaki Desk | 27 Aug 2020 4:00 PM GMTనెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి ఉందట.. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు టీడీపీ, వైసీపీల మధ్య ఢీ అంటే ఢీ అనే ఫైట్ నడుస్తోందట.. టీడీపీకి పెద్ద దిక్కు అయిన ‘బీద మస్తాన్ రావు’ ఎన్నికల తరువాత బిజినెస్ ల కోసం అధికార పార్టీలోకి చేరిపోయాడనే ప్రచారం నియోజకవర్గంలో ఉంది. వైసీపీ నుంచి గెలిచిన రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డికి మస్తాన్ రావు ఇప్పుడు నియోజకవర్గంలో చుక్కలు చూపిస్తున్నాడట..
బీద మస్తాన్ రావు తమ్ముడైన బీద రవి చంద్రయాదవ్ ఇప్పుడు టీడీపీ తరుఫున ఎమ్మెల్సీగా ఉన్నాడు. అన్న మస్తాన్ బిజినెస్ ల కోసం వైసీపీలో చేరితే.. తమ్ముడు మాత్రం అక్కడే టీడీపీ తరుఫున నిలబడి వైసీపీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్నాడంట.. ఇదేమీ రాజకీయం అని ఇప్పుడు నియోజకవర్గంలో ఒకటే చర్చ జరుగుతోంది.
అన్న వైసీపీలో చేరి తమ్ముడికి పెట్టుబడి పెడుతూ రాజకీయం చేస్తున్నాడని.. వైసీపీ ఎమ్మెల్యేను ఇరుకున పెడుతున్నాడనే ప్రచారం నియోజకవర్గంలో ఉంది. ఇది కరెక్ట్ కాదని అక్కడి వైసీపీ నేతలు, కార్యకర్తలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారంట..
టీడీపీ ఎమ్మెల్సీ అయిన బీద రవిచంద్ర యాదవ్ అప్పట్లో జరిగిన మండలి సమావేశాల్లో వైసీపీ మంత్రి మీదకు పోయి గొడవపడి లోకేష్ కు అండగా నిలబడ్డాడు. ఫక్తు టీడీపీకి ఫేవర్ గా రాజకీయం చేస్తున్నాడు.
అయితే ఆయన అన్న మస్తాన్ రావు బిజినెస్ లు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి వైసీపీలో చేరి ఇప్పుడు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఏ పనిచేసినా అడ్డుపడుతూ ఇబ్బందులు పెడుతున్నాడని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అన్నాదమ్ముల పార్టీలు వేరైనా.. వారి చీకటి వ్యవహారంపై ఇప్పుడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట..