Begin typing your search above and press return to search.

గోవా సీఎం ఆరోగ్యం.. గోమాంసానికి లింక్

By:  Tupaki Desk   |   6 Feb 2019 7:38 AM GMT
గోవా సీఎం ఆరోగ్యం.. గోమాంసానికి లింక్
X
గోవా ముఖ్యమంత్రి ఆరోగ్యానికి, గోవాలో గోమాంసానికి లింకుపెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అఖిలభారత హిందూ మహాసభ నేత స్వామి చక్రపాణి మహారాజ్. గోవాలో గోమాంసాన్ని నిషేధిస్తే ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంలో వెంటనే మార్పు వస్తుందంటూ నోరుజారారు.

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికల్ ‘పాంట్రియాటిక్ క్యాన్సర్’తో బాధపడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. పారికర్ గోవా సీఎం హోదాలోనే ఇంకా కొనసాగుతున్నారు.

ఈ నేపథ్యంలో స్వామి చక్రపాణికి గోవుల శాపమే దీనికి కారణమని వెల్లడించారు. గోవాలో విచ్చలవిడి గోమాంసం విక్రయించడానికి వ్యాపారులకు తాను అండగా ఉంటున్నట్టు మనోహర్ పారికర్ సంకేతాలు ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా జరిగిందంటూ చక్రపాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇక చక్రపాణి నోరుజారడం ఇదే తొలిసారి కాదు.. కేరళ వరద సమయంలోనూ ఈయన ఇలానే మాట్లాడారు. కేరళలో గోమాంసం ఎక్కువగా సేవిస్తారు కనుక ఆ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయని కామెంట్ చేసి దుమారం రేపారు. ఇంకెప్పుడు బీఫ్ తినమని వరద బాధితులు అఫిడవిట్ సమర్పించాకే వారికి సాయం చేయాలని చక్రపాణి వ్యాఖ్యానించడం కలకలం రేపింది.

మూడు నెలల తర్వాత ఈ మధ్యనే మనోహర్ పారికర్ తన నివాసంలో కేబినెట్ భేటి నిర్వహించారు. అయితే ఆయన అనారోగ్యం దృష్ట్యా గోవాలో నాయకత్వంలో మార్పులు రావాల్సి ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.