Begin typing your search above and press return to search.
ఓయూలో పెద్దకూర పండుగ జరిగిందా?
By: Tupaki Desk | 10 Dec 2015 9:52 AM GMTఉద్రిక్తతకు కారణమైన పెద్దకూర పండుగ వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్దకూర పండుగ నిర్వహించాలని ఒక వర్గం విద్యార్థులు పిలుపునివ్వటం.. మరోవర్గం దీన్ని అడ్డుకుంటామని చెప్పటం లాంటి అంశాలతో ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. స్థానిక కోర్టుతో పాటు.. హైకోర్టు సైతం పెద్దకూర పండుగను ఓయూలో నిర్వహించటం సరికాదంటూ.. ఈ పండుగను నిర్వహించటానికి తాము అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
కోర్టు తీర్పు ఇలా ఉన్నా.. తాము అనుకున్నట్లే పెద్దకూర పండుగను నిర్వహిస్తామంటూ ఓయూలోని కొందరు తేల్చి చెప్పిన నేపథ్యంలో శాంతిభద్రతలకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓయూలోని వసతిగృహాల్లో భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే.. ఉస్మానియాలో పెద్దకూర పండుగ నిర్వహించినట్లుగా కొన్ని ఫోటోలు.. వీడియోలు వాట్సప్ లలో బయటకు రావటంతో.. దీన్ని వ్యతిరేకించే వర్గం ఆవేశానికి గురైంది. ఉస్మానియా వర్సిటీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉస్మానియాలో ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఓయూలో మరోసారి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలతో అగ్రహానికి గురైన మరో వర్గం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బస్సుపై దాడికి యత్నించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఉస్మానియా వర్సిటీ.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.