Begin typing your search above and press return to search.
నిజమేనా?: బాబు ఇఫ్తార్ విందులో బీఫ్?
By: Tupaki Desk | 21 Jun 2017 7:44 AM GMTబీఫ్ మీద దేశ వ్యాప్తంగా జరుగుతున్న రచ్చ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే ఈ ఇష్యూ మీద ఎన్నెన్ని రచ్చలు జరిగాయో తెలిసిందే. బీఫ్ మీద వాద ప్రతివాదనలు జరుగుతున్న వేళలోనే.. మాంసం కోసం ఎద్దులు.. ఆవుల్ని అమ్మకాలు..కొనుగోలుపై కేంద్రం పరిమితులు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీఫ్ మీద దేశంలో ఇంత జరుగుతున్న వేళ.. కమలనాథులకు క్లోజ్ ఫ్రెండ్ అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుపై పలు విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కర్నూలు జిల్లా నంద్యాలలో ఇఫ్తార్ విందును ఏపీ సర్కారు నిర్వహిస్తోంది. ఒక చిన్న టౌన్ లో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుకోసం దాదాపు కోటి రూపాయిల వరకూ ఖర్చు చేయనున్నట్లుగా తెలుస్తోంది.
త్వరలో జరిగే నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఇఫ్తార్ విందును అక్కడ నిర్వహించాలని బాబు సర్కారు డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు.మైనార్టీ ఓట్లు క్రియాశీలకంగా మారిన వేళ.. ఇఫ్తార్ విందును ఒక వేదికగా చేసుకోనున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఈ విమర్శ ఒకవైపు వినిపిస్తుంటే.. మరోవైపు ఏపీ అధికారపక్షం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులో బీఫ్ కూడా వండుతున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. స్థానికంగా వినిపిస్తున్న మాటల ప్రకారం.. ఇఫ్తార్ విందులో చికెన్.. మటన్ లు మాత్రమే కాదు.. భారీగా బీఫ్ కూడా వండి వారుస్తారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇందులో నిజం మాట ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఎక్కడో మారుమూల ప్రాంతంలో తెలిసీ తెలియక బీఫ్ వండే వారి మీద విరుచుకుపడే కమలనాథులు.. తమ మిత్రపక్షం అధికారికంగా నిర్వహిస్తున్న ఇఫ్తార్ లో బీఫ్ మీద వస్తున్న వార్తల పై ఎందుకు రియాక్ట్ కావటం లేదన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/