Begin typing your search above and press return to search.
కరోనా ఎఫెక్ట్ : మూతబడ్డ బీరు ఫ్యాక్టరీలు!
By: Tupaki Desk | 4 April 2020 3:30 AM GMTకరోనా వైరస్ ప్రభావం ప్రపంచంలోని ప్రతి రంగం పై పడింది. ఇప్పటికే ఎన్నో కంపెనీలు కరోనా కారణంగా తమ ఉత్పత్తులని నిలిపేశాయి. తాజాగా మెక్సికన్ కంపెనీకి చెందిన కరోనా బీరు ప్రొడక్షన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి విస్తరిస్తున్న కారణంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. అలాగే గ్రూపో మోడలోకు చెందిన ఇతర బ్రాండ్లు అయిన పసిఫికో, మోడెలోలు సైతం మెక్సికో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 30వరకూ ప్రొడక్షన్ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రొడక్షన్ తగ్గించే పనిలో భాగంగా ప్లాంట్లను సిద్ధం చేస్తున్నాం. కొద్ది రోజుల్లో దీనిని పూర్తిగా తగ్గించాలనుకుంటున్నాం అని , కేవలం వ్యవసాయానికి సంబంధించిన పనులు మాత్రమే జరుగుతాయిని మిగిలిన వాటిని రద్దు చేస్తున్నట్లుగా మెక్సికో ప్రభుత్వం ప్రకటించింది. అయితే , ప్రభుత్వం ఒప్పుకుంటే 75శాతం మంది కార్మికులతో బీరు సిద్ధం చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని గ్రూపో మోడలో చెప్పింది.
ఇకపోతే, మరో బీరు సంస్థ అయిన హీనెకిన్ కూడా శుక్రవారం నుంచి బీరు ఉత్పత్తి ఆపేయనుంది. బీరు ఉత్పత్తిని ఆపేయడంతో పాటుగా డిస్ట్రిబ్యూషన్ ను కూడా నిలిపేసింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో వస్తున్న సంక్షోభాన్ని అడ్డుకునే దిశగా టాప్ బీర్ కంపెనీలు సైతం బీరు ఉత్పత్తిని నిలిపేస్తున్నాయి. ఈ విషయం ఇలా ఉంటే .. కరోనా వైరస్ సంక్షోభం మొదలైనప్పటి నుండి కరోనా బీర్ మీద ఆన్ లైన్ జోకులు - మీమ్స్ వైరల్ గా మారాయి. ఫలితంగా అమెరికాలో 40శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. అయితే, ఈ కరోనా బీరు తాగడం వల్ల కరోనా వైరస్ సోకే ఆస్కారం లేదు అని యాజమాన్యం ఎంతగా ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ఉపయోగం లేదు.