Begin typing your search above and press return to search.

ఆరోగ్యం కోసం పాలకంటే బీర్ బెటర్

By:  Tupaki Desk   |   22 Dec 2019 7:57 AM GMT
ఆరోగ్యం కోసం పాలకంటే బీర్ బెటర్
X
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టును అన్నాడు నాటి గిరీషం. ఇప్పుడు మద్యం తాగని వాడు నిజంగా దున్నేపోతే అంటున్నారు ఆధునిక గిరీషంలు.. ఆడ మగా తేడా లేకుండా అందరూ మద్యంను తాగేస్తున్నారు. బీర్లు ఆడవాళ్లు కూడా నీళ్లు తాగినట్టు తాగుతున్నారు.

అయితే ఎవ్వరూ ఏమన్నా తాజాగా ప్రముఖ జంతు సంరక్షణ సంస్థ(పెటా) ప్రకటన మాత్రం మందుబాబులకు తెగ జోష్ ను ఇచ్చింది. మనుషుల ఆరోగ్యానికి పాలు తాగడం కంటే రోజూ ఓ పెగ్గు బీరే బెటర్ పెటా అని చెబుతోంది. ఈ మేరకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనలు చేసి విడుదల చేసిన రిపోర్టు ఆధారంగా పెటా ఈ విషయాన్ని తెలియజేసింది.

ఆరోగ్యం కోసం పాలకంటే బీర్ బెటర్ అని పెటా స్పష్టం చేస్తోంది. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని పరిశోధన గురించి చెప్పుకొచ్చింది. పాలు, డెయిరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, ఒబెసిటీ, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని పెటా హెచ్చరించింది. పాల ఉత్పత్తుల వల్ల ఎముకల వ్యాధి కూడా సోకుతుందని తేల్చింది. కానీ బీరు తాగడం వల్ల ఎముకలు బలోపేతమవుతాయని పెటా చెబుతోంది.