Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ తీసుకుంటే బీరు ఫ్రీ

By:  Tupaki Desk   |   3 Jun 2021 8:31 AM GMT
వ్యాక్సిన్ తీసుకుంటే బీరు ఫ్రీ
X
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ తో ఇప్పుడు ప్రజలంతా వ్యాక్సిన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా దేశంలో వ్యాక్సిన్ల కొరతతో 18-45 ఏళ్లలోపు వారికి ఇప్పటికీ టీకాలు వేయడం లేదు. దేశంలో టీకాల ఉత్పత్తి ఇంకా గాడిన పడక ప్రజలంతా హాహాకారాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అమెరికాలో మాత్రం ధీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది.

అమెరికా ప్రభుత్వం ముందస్తుగానే వ్యాక్సిన్ తయారీ దశలోనే కంపెనీలకు బిలియన్ డాలర్లు సొమ్మును ఇచ్చి దేశ ప్రజల కోసం వ్యాక్సిన్లను విరివిగా సేకరించింది. ఇతర దేశాలకు ఎగుమతులు నిషేధించి మరీ మిలియన్ల డోసుల వ్యాక్సిన్ ను అమెరికా ప్రభుత్వం అట్టిపెట్టుకుంది. భారత్ కు ఇవ్వడానికి కూడా అమెరికా ముందుకు రావడం లేదు.

అమెరికా ప్రభుత్వం అక్కడి ప్రజలను వ్యాక్సిన్లను తీసుకోమని ఎంతలా ప్రాధేయపడుతున్నా అమెరికన్లు మాత్రం వ్యాక్సిన్లు వేసుకోవడానికి అస్సలు ముందుకు రావడం లేదట..

దీంతో అమెరికాలో వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ప్రోత్సహించేందుకు రకరకాల ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే డ్రింక్స్ తయారు చేసే అన్ హైజర్ అనే సంస్థ.. 21 ఏళ్లు పైబడిన యువతను దృష్టిలో ఉంచుకొని కొత్త ఆఫర్ ప్రకటించింది. టీకా వేయించుకొని తమ వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకునే తొలి 2 లక్షల మందికి ఒక్కొక్కరికి 5 డాలర్ల విలువైన బీర్ ను ఉచితంగా అందిస్తామని సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది.