Begin typing your search above and press return to search.
మందుబాబులకు శుభవార్త ...మూడు నెలలు బీర్లు ఫ్రీ ఫ్రీ ..కానీ !
By: Tupaki Desk | 30 March 2020 6:20 AM GMTప్రస్తుతం కరోనా దెబ్బకి మందుబాబుల నాలుకలు జివ్వుమంటున్నాయి. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కరోనా ని అరికట్టే ప్రయత్నంలో వైన్ షాప్స్ ని పూర్తిగా మూసేసారు. దీనితో మందుబాబుల కష్టాలు అన్ని ఇన్ని కాదు. వారి కష్టాలని ఎవరు తీర్చలేకపోతున్నారు. చుక్క పడితే కానీ కునుకు రాని వారు మద్యం కోసం పరితపిస్తున్నారు, మరికొందరు కొన్ని చోట్ల పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి సమయంలో బీర్లు ఫ్రీ గా ఇస్తాం అంటే ..పోయిన ప్రాణం వెనక్కి తిరిగొచ్చినట్టే ..అది కూడా ఎదో ఒకరోజు , రెండు రోజులు కాదు ..ఏకంగా మూడు నెలలు.
ఈ వార్త బీర్లు తాగే వారికీ పెద్ద శుభవార్త. యితే.. ఇక్కడ ఓ కండిషన్ ఉంది. కుక్కను దత్తత తీసుకోవాలి. దానికి సపర్యలు చేయాలి. బీర్లు మూడు నెలలు ఫ్రీ గా ఇస్తామంటే ..ఒక కుక్కని ఏంటి ..ఎన్ని కుక్కలైనా కూడా దత్తత తీసుకుంటాం అని అనుకుంటున్నారా. అయితే , ఈ అవకాశం మాత్రం అమెరికాలో ఉండే వారికీ మాత్రమే. అమెరికాలోని మిన్నెసోటాలో ఉన్న మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ ఈ ఆఫర్ ను అందిస్తోంది. కరోనా దెబ్బకు అమెరికా ప్రస్తుతం అతలాకుతలం అవుతోంది. దీంతో చాలా మంది జంతువులకు సంబంధించిన సంస్థలు మనుషులను దగ్గరకు రానివ్వడం లేదు. మనుషులతో వాటికి కరోనా సోకుతుందన్న భయం.
అయితే, మిడ్ వెస్ట్ సంస్థ మాత్రం కుక్కలను దత్తత ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.దాదాపు 500 కుక్కలను దత్తత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే.. బుష్ బీర్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకొని ముందడుగు వేసింది. ఎవరైతే కుక్కను దత్తత తీసుకుంటారో వారికి మూడు నెలలకు సరిపడ బీర్ ను బుష్ బీర్ కంపెనీ ఉచితంగా అందివ్వనుంది. కుక్కను దత్తత తీసుకున్న వారు.. ప్రూఫ్ కింద కుక్కతో ఫొటో దిగి బుష్ బీర్ కంపెనీ ఫేస్ బుక్ - వాట్సాప్ - ఇన్ స్టాగ్రామ్ పేజీలకు పంపించాల్సి ఉంటుంది. ముందుగా పంపించే వారికి 100 డాలర్ల(రూ.7500) రివార్డ్ ఇస్తుంది. ఈ ఆఫర్ మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు మాత్రమే ఉంటుందని ఆ బీర్ కంపెనీ తెలిపింది.