Begin typing your search above and press return to search.
మోడీ మాటలు మరిచిపోకముందే.. మరో రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ!
By: Tupaki Desk | 9 Feb 2022 4:30 AM GMT``రాష్ట్రాలకు రాష్ట్రాలు మీ నుంచి దూరమవుతున్నాయి. మీ జెండా పట్టుకునే కార్యకర్తలు కూడా లేరు. అయినా.. మీకు అహంకారం పోలేదు`` -ఇదీ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ సాక్షిగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. అయితే.. మోడీ ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటలుకూడా గడవకముందే.. ఇంకా ప్రజల చెవుల్లోనూ.. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల చెవుల్లోనూ ఈ మాటలు వినిపిస్తూనే ఉన్న సమయంలో.. కాంగ్రెస్ నుంచి మరో రాష్ట్రం జారిపోయింది! ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.
ఈశాన్య ప్రాంత రాష్ట్రమైన మేఘాలయలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలోని ఐదుగురు ఎమ్మెల్యేలు కాన్రాడ్ కే సంగ్మా నేతృత్వంలోని మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్(ఎండీఏ)లో చేరాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ మేరకు మేఘాలయ సీఎం కాన్రాడ్ కే సంగ్మాకు లేఖ అందజేశారు. కాంగ్రెస్ శాసనసభాపక్షనేత అంపరీన్ లింగ్డో, మేరాబోర్ సీయం, మోహెన్డ్రో రాప్సాంగ్, కిమ్ఫా మార్బనియాంగ్, పీటీ సాక్మి ఎండీఏలో చేరుతున్నట్లు లేఖ ద్వారా వెల్లడించారు. ఇదే లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా పంపారు.
మేఘాలయ డెమొక్రటిక్ కూటమిలో చేరాలని మేము ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం. మా మద్దతుతో ఎండీఏ మరింత బలపడుతుందని, రాష్ట్రాన్ని ముందుకుతీసుకెళ్తుందని, ప్రజల ఆశయాలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్లోని ఎమ్మెల్యేలంతా ఎండీఏలో చేరడం వల్ల.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రాతినిధ్యం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. అదేసమయంలో తృణమూల్ కాంగ్రెస్ మేఘాలయలో ప్రధాన ప్రతిపక్షం అయింది.
2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 19 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు మరణించడం వల్ల ఉపఎన్నికలు నిర్వహించారు. దీంతో ఆ రెండు స్థానాలను నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) కైవసం చేసుకుంది. గతేడాది 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు మిగిలి ఉన్న ఐదుగురు ఎండీఏలోకి వెళ్తున్నారు. 2023లో మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.