Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల‌కు ముందే హీటెక్కిన ఏపీ.. .!

By:  Tupaki Desk   |   9 Nov 2022 9:30 AM GMT
ఎన్నిక‌ల‌కు ముందే హీటెక్కిన ఏపీ.. .!
X
ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగేందుకు ఏడాదిన్న‌ర స‌మ‌యం పైగానే ఉంది. అయితే.. రాష్ట్రంలో మాత్రం రాజ‌కీ య కాక ఇప్ప‌టి నుంచే ప్రారంభ‌మైంది. ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఒక‌వైపు.. మ‌రో పార్టీ జ‌న‌సేన మ‌రోవైపు.. రాజ‌కీయాలను హీటెక్కించాయి. మ‌రోవైపు.. ఈ రాజ‌కీయ పార్టీల‌కు తోడు.. ఇప్పుడు మీడియా కూడా ఏడాదిన్న‌ర ముందుగానే వైసీపీ స‌ర్కారుపై యాంటీ యాంగిల్ ఎంచుకుని దూసుకుపోతోంది. సాధార‌ణంగా అన్ని రాష్ట్రాల్లోనూ.. అదేవిధంగా జాతీయ స్థాయిలోనూ మీడియా త‌న‌దైన పంథాను ఎప్పుడూ ఎంచుకుంటుంది.

అయితే, ఇది ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగే ప్ర‌క్రియ. ఆరు మాసాలు లేదా.. నాలుగు మాసాల ముందు మాత్రమే మీడియా తాను ఎంచుకున్న పార్టీకి.. లేదా అనుకూల పార్టీల నేత‌ల‌కు అనుగుణంగా క‌థ‌నాలు రాయ‌డం.. ప్ర‌చారం, ప్ర‌సారం చేయ‌డం కామ‌నే. గతంలోనూ ఇది జ‌రిగింది. 2014లో గుజ‌రాత్ సీఎంగా ఉన్న న‌రేంద్ర మోడీని దేశ‌వ్యాప్తంగా ప‌రిచ‌యం చేయ‌డంలో ఎన్నిక‌ల‌కు ఏడాది ముందే మీడియా త‌న పాత్ర పోషించింది. 2019లో ఎన్నిక‌ల‌కు నాలుగు మాసాల ముందు నుంచి అనుకూల పార్టీల వైపు మీడియా త‌న ప్రభావాన్ని చూపించింది.

అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందు నుంచి ఏపీ ప్ర‌భుత్వం పై ఓవ‌ర్గం మీడియా తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తిపోస్తోంది. అంతేకాదు.. నిత్యం పుంఖాను పుంఖాలుగా క‌థ‌నా ల‌ను ఓ వ‌ర్గం ప‌త్రిక‌లు ప‌తాక శీర్షిక‌లుగా ప్ర‌చురిస్తోంది. ఇప్పుడు ఇదే విష‌యం వైసీపీలోనూ చ‌ర్చ‌గా మారింది. దీనిని రెండు ర‌కాలుగా నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు. ఏడాదిన్న‌ర ముందునుంచే త‌మ‌పై యుద్ధం ప్ర‌క‌టించారంటే.. ప్ర‌జ‌ల్లో త‌మ‌కుఎంతో హ‌వా ఉంద‌నే దిశ‌గా నాయ‌కులు భావిస్తున్నారు.

ప్ర‌జ‌ల్లో త‌మ‌కు అనుకూల వాతావ‌ర‌ణం ఉండ‌బ‌ట్టే.. ఇప్పుడే.. త‌మ‌పై యుద్ధం ప్ర‌క‌టించార‌ని.. త‌మ గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని కొంద‌రు అంటున్నారు. మ‌రికొంద‌రు.. మాత్రం ఎందుకైనా మంచిది జాగ్ర‌త్త ప‌డ‌డం బెట‌ర్ అని వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రోవైపు పార్టీ అధిష్టానం స‌హా.. సీఎం జ‌గ‌న్ కూడా ఈ యాంటి ప్రచారంపై క‌న్నేశార‌ని, దీనికి ప్ర‌తిగా త్వ‌ర‌లోనే తాము కూడా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.