Begin typing your search above and press return to search.
అసెంబ్లీలో బాబు సంచలన ప్రకటనకు ముందు అలా జరిగిందట!
By: Tupaki Desk | 20 Nov 2021 12:30 PM GMTఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పొగిలి పొగిలి ఏడ్చారు. ముఖంలో భావోద్వేగాల్ని కనిపించకుండా ఉండటం.. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆయన డీలా పడిపోవటమే కాదు.. ఆయన రోదించిన తీరు సంచలనంగా మారింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. ఆ మాటకు వస్తే ఆయనపై మావోలు దాడి కూడా చేశారు. చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అలాంటి చంద్రబాబు.. అప్పట్లో కూడా కంట కన్నీరు పెట్టుకోలేదు. ధైర్యం సడలనివ్వలేదు. కానీ.. తాజాగా ఉదంతంలో మాత్రం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన దు:ఖాన్ని నియంత్రించుకోవటానికి చాలానే కష్టపడ్డారు. అయినా.. ఆయన వేదన తీరలేదు.
గురువారం ఏపీ అసెంబ్లీలో తన భార్యను ఉద్దేశిస్తూ దారుణ వ్యాఖ్యలు చేయటం.. ఆమె వ్యక్తిత్వ హననానికి గురి చేసిన తీరుకు చంద్రబాబు తీవ్రంగా చలించిపోయారు. అసెంబ్లీలో తానిక సభలో అడుగు పెట్టనని.. మళ్లీ ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత మాత్రమే తాను సభకు వస్తానంటూ శపధం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి.. మధ్యలో బోరున విలపించటం తెలిసిందే. అయితే.. దీనికి ముందుచాలానే జరిగినట్లుగా చెబుతున్నారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలు అందిస్తున్న సమాచారం ప్రకారం అసలేం జరిగిందన్నది చూస్తే..
ఎదురుదెబ్బలు.. అవమానాలు.. కష్టాలు చంద్రబాబుకు కొత్తేం కాదు. తన కెరీర్ లో ఎందరో ముఖ్యమంత్రుల్ని ఎదుర్కొన్న చంద్రబాబు.. తాజాగా అంతలా బరస్ట్ కావటానికి కారణం ఏమిటి? సభలో ఏం జరిగింది? అన్నది చూస్తే.. అధికార వైసీపీకి చెందిన నేతలు కొందరు చంద్రబాబు మాట్లాడుతున్న వేళ.. ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రికార్డుల్లోకి ఎక్కని రీతిలో వైసీపీకి కొందరు నేతలు చంద్రబాబు వెనుక నుంచి.. ఆయనకు వినపడేలా దారుణ వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై సభలో వాగ్వాదం జరిగిన తర్వాత స్పీకర్ తమ్మినేని సభను వాయిదా వేశారు.
సభ నుంచి నేరుగా తన ఛాంబర్ లోకి వచ్చి కూర్చున్న ఆయన ముఖం తీవ్రమైన అవమానభారానికి గురయ్యారు. అప్పటికే వస్తున్న దు:ఖాన్ని నియంత్రించుకునేందుకు చాలానే ప్రయత్నించారు. కాసేపు యాంటీ రూంలోకి వెళ్లి ఒక్కడిగా ఉండి వచ్చారు. బాబును చూస్తేనే పార్టీ శాసన సభాపక్ష నేత అచ్చెన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ సహచరుల్ని చూసిన తర్వాత చంద్రబాబులో దు:ఖం కట్టలు తెంచుకుంది. వారి ముందే భోరున విలపించారు.
అంత అవమానం జరిగిన తర్వాత సభలోకి అడుగు పెట్టకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. సభలోనే తన ఆవేదనను వెల్లడించి.. బయటకు వచ్చేయాలన్న ఉద్దేశంతో సభలోకి వెళ్లారు. స్పీకర్ మైకు ఇచ్చారు. చంద్రబాబు తన ఆవేదనన వ్యక్తం చేస్తున్న సమయంలోనూ.. వైసీపీ నేతలు ఆయన్ను రెచ్చగొట్టేలా రన్నింగ్ కామెంటరీ చేస్తూనే ఉన్నారు. బాబు తన ప్రసంగాన్ని పూర్తి చేయక ముందే స్పీకర్ తమ్మినేని మైక్ కట్ చేశారు.
దీంతో తీవ్ర ఆవేదనకు గురైన చంద్రబాబు సభ నుంచి బయటకు వచ్చేశారు. అవమాన భారంతో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మీడియా భేటీని నిర్వహించారు. భావోద్వేగాన్ని నియంత్రించుకునే విషయంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు పదే పదే భోరున విలపించారు. ఆయన్ను దశాబ్దాలుగా చూస్తున్న వారు సైతం.. చంద్రబాబు పొగిలి ఏడుస్తన్న వైనానికి విస్మయానికి గురయ్యారు. ఎంతటి ఆవేదన చెందకుంటే అంతలా రోదిస్తారన్న మాటలు పలువురి నోట వినిపిస్తున్నాయి.