Begin typing your search above and press return to search.
మరీ ఇంత చీప్ గా ప్రవర్తించాలా ?
By: Tupaki Desk | 2 July 2021 2:30 PM GMTతెలుగుదేశంపార్టీ నేతలు కొందరు మరీ చవకబారుగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే రిటైర్ అయిన ముగ్గురు ఎంఎల్సీల వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జూన్ లో రిటైర్ అయిన టీడీపీ ఎంఎల్సీల్లో ముగ్గురు తమ పదవీకాలం ఆగష్టు వరకు ఉందంటు గోల మొదలుపెట్టారు. పదవీకాలం పూర్తయిన కారణంగా టీడీపీకి చెందిన ఏడుగురు ఎంఎల్సీలు మొన్నటి జూన్ 18వ తేదీన పదవీ విరమణ చేశారు.
షెడ్యూల్ ప్రకారం అప్పుడు పదవీ విరమణ చేసేసి ఇపుడు ఆగష్టువరకు పదవులు ఉన్నాయంటో వాదనకు దిగారు. అసెంబ్లీ కార్యదర్శి పి బాలకృష్ణమాచార్యులకు ముగ్గురు మాజీ ఎంఎల్సీలు రెడ్డి సుబ్రమణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, ద్వారపురెడ్డి జగదీష్ లేఖలు రాశారు. సెక్రటరీ నుండి సానుకూలంగా స్పందన రాకపోతే కోర్టులో కేసు వేసే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
పదవీకాలం విషయమై కోర్టులో కేసు వేయాలని చంద్రబాబునాయుడు సూచించటంతో వీళ్ళు కేసు వేయటానికి రెడీ అవుతున్నారు. అసలు జరిగిందేమంటే ఏడుగురు పదవీకాలం ముగిసింది జూన్ 18వ తేదీనే. ఎందుకంటే వీళ్ళందరు ఎంఎల్సీలుగా ఎన్నికైనట్లు 2015 జూన్ 19వ తేదీన సర్టిఫికేట్లు జారీచేశారు. ఈ లెక్కన 2021, జూన్ 18న పదవీకాలం పూర్తయిపోయిందన్నది వాస్తవం.
అయితే ఎంఎల్సీల ఎన్నిక విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమీషన్ మాత్రం 2015 ఆగష్టు 12వ తేదీన గెజెట్ రిలీజ్ చేసింది. అంటే రాష్ట్ర ఎన్నికల కమీషన్ రిలీజ్ చేసిన గెజెట్ ను పై ముగ్గురు ఎంఎల్సీలు ఇపుడు తమ వాదనకు మద్దతుగా పట్టుకున్నారు. ఒకవేళ రిలీజయిన గెజెట్టే నిజమనుకుంటే మరి 2015, జూన్ నుండే ఎంఎల్సీలుగా జీతాలు ఎలా తీసుకున్నారంటే మాత్రం నోరిప్పటంలేదు. మొత్తానికి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ లో జరిగిన జాప్యాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు మరీ చీప్ గా వ్యవహరిస్తున్నట్లే ఉంది.