Begin typing your search above and press return to search.

టీడీపీ ని, జనసేన ని కలుపుతున్న కొత్త ఓటీటీ ప్లాట్‌ఫాం

By:  Tupaki Desk   |   5 Nov 2021 9:31 AM GMT
టీడీపీ ని, జనసేన ని కలుపుతున్న కొత్త ఓటీటీ ప్లాట్‌ఫాం
X
ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా లో నంద‌మూరి బాల‌కృష్ణ ఓ షో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న వ్యాఖ్యాత‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్న అన్‌ స్టాప‌బుల్ అనే షో ఇటీ వ‌లే ఆరంభ‌మైంది. న‌ట‌న‌ తో అద‌ర‌ గొట్టే బాల‌కృష్ణ ఇప్పుడు వ్యాఖ్యాత‌ గా స‌త్తా చాటుతున్నార‌ని అభిమానులు అంటున్నారు. అయితే ఆహా లో బాల‌కృష్ణ ఈ షో చేయ‌డానికి వెన‌క మ‌రో ఆస‌క్తిక‌ర కార‌ణం ఉంద‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీ పొత్తు పెట్టుకుని పోటీ చేయాల‌ని.. ఆ రెండు పార్టీల‌ ను క‌లిపేందుకు ఇలా ఆహా షోను తెర‌మీద‌కు తెచ్చార‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. ఇప్ప‌టికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన, టీడీపీ పొత్తు పెట్టుకుంటాయ‌నే టాక్ గ‌ట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌ గా ఆహాలో షో వ‌స్తుండ‌డం ఆ ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంద‌నే అభి ప్రాయాలు విని పిస్తున్నాయి.

అల్లు అర‌వింద్ కుటుంబం ఈ ఆహా ఓటీటీ ని న‌డిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో బాల‌కృష్ణ‌ కు షో చేసే అవ‌కాశం ఇచ్చారు. గ‌తం లో బాల‌కృష్ణ‌ ఇలాంటి షోలు చేయాల‌నుకున్న ఎవ‌రూ అవ‌కాశం ఇవ్వ‌ లేద‌ని స‌మాచారం. ఇప్పుడు అరవింద్ ఆహా లో అవకాశమివ్వ‌డం వెన‌క రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇప్పుడు బాల‌కృష్ణ‌ నే జ‌న‌సేన‌, టీడీపీల‌ ను క‌లుపు తార‌ని చెప్తున్నారు. వచ్చే ఎన్నిక‌ల్లో అల్లు అర‌వింద్ పెద్ద కొడుకు అల్లు బాబి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఏదో ఒక నియోజ‌క‌ వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని అను కుంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అందు కే ఇప్పుడు బాల‌కృష్ణ‌ ను త‌మ ఓటీటీ లోకి తీసుకొచ్చార‌ని ఆయ‌న కార‌ణం గా జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు కుదిరితే బాబి పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుంద‌ని ఓ పెద్ద ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంది.

ఆంధ‌ప్ర‌దేశ్ బాగు కోసం ఎవ‌రి తోనైనా క‌లిసేందుకు సిద్ధం గా ఉన్నామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. జ‌న‌సేన ప్ర‌స్తుతం బీజేపీ తో పొత్తు లో ఉంది. కానీ ఇప్పుడా బంధం విడి పోయే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభి ప్రాయ‌ప‌డుతున్నారు. రాజ‌కీయ విలువ‌ల పేరు తో బద్వేలు ఉప ఎన్నిక‌ లో పోటీ నుంచి జ‌నసేన త‌ప్పుకున్నప్ప‌టికీ.. బీజేపీ బ‌రి లో దిగింది. బీజేపీ త‌ర‌పున ప‌వ‌న్ ప్ర‌చారం చేస్తార‌ని ఆ పార్టీ నేత‌లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. మ‌రో వైపు కేంద్రం లో ఉన్న బీజేపీ స‌ర్కారు తీసుకున్న‌ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రై వేటీక‌ర‌ణకు వ్య‌తిరేకం గా ఉద్య‌మానికి ప‌వ‌న్ మ‌ద్ద‌తు గా నిలుస్తున్నారు. దీంతో బీజేపీ, జ‌న‌సేన బంధం ముగుస్తుంద‌నే ప్ర‌చారం జోరు గా సాగుతోంది. మ‌రోవైపు టీడీపీ తో పొత్తు కు బీజేపీ స‌సేమీరా అంటోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన పొత్తు ఖాయం గా ఉంటుంద‌ని అనిపిస్తున్న‌ప్ప‌టికీ వాళ్ల‌తో బీజేపీ క‌లిసి ఉంటుందా? లేదా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.