Begin typing your search above and press return to search.

ఇంతకీ 'కియా' క్రెడిట్ ఎవరిది? వైఎస్ ఏం చేశారు?

By:  Tupaki Desk   |   13 Aug 2019 1:37 PM GMT
ఇంతకీ కియా క్రెడిట్  ఎవరిది? వైఎస్ ఏం చేశారు?
X
'కియా' అంటే 'మేడిన్ రాయలసీమ' కారు. రాయలసీమలో తయారవుతున్న కారు ఇక దేశమంతా పరుగులు తీయనుంది. దేశంలో 'కియా' నెలకొల్పిన ఏకైక ప్లాంట్ కు రాయలసీమే వేదిక అయ్యింది. మరి ఇంతకీ ఆ సంస్థ అక్కడ నెలకొల్పబడటానికి కారణం ఎవరు? దాని క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? పోటాపోటీగా దాని క్రెడిట్ ను క్లైమ్ చేసుకుంటున్న వారిని చూసి ప్రజలు ఏమనుకుంటున్నారు? అనేవి ఆసక్తిదాయకమైన అంశాలు. రాజకీయ నేతలు ఈ విషయంలో ఎవరు ఏ ప్రకటనలు చేసుకున్నా.. అసలు కథ మాత్రం ప్రజలకు తెలుసు! స్థానికులకు స్పష్టంగా తెలుసు!

అందుకు సంబంధించి క్షేత్ర స్థాయి కథ ఇది. 'కియా' కార్ల పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పడం గురించి ఇటీవలే ఈ సంస్థ మాతృసంస్థ అయిన హుండాయ్ చైర్మన్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖల సంగతి ఎలా ఉన్నా.. అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద 'కియా' ఏర్పడటం వెనుక మాత్రం ముఖ్యపాత్ర దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిదే. పరోక్షంగా అయినా ఆ ప్రాంతాన్ని పరిశ్రమ ఏర్పాటుకు అనుగుణంగా మార్చారు వైఎస్.

అలాగే హంద్రీనీవా ప్రాజెక్టు మీద వైఎస్ పెట్టిన శ్రద్ధ అక్కడ కియా పరిశ్రమ ఏర్పాటుకు కారణం అయ్యింది. హంద్రీనీవా ప్రాజెక్టుపై వైఎస్ ఎంతో శ్రద్ధ చూపించారు. అందులో భాగంగా ‘గొల్లపల్లి’ వద్ద భారీ రిజర్వాయర్ నిర్మితం అయ్యింది. ఆ రిజర్వాయర్ కియాకు ప్రధాన నీటి వనరు. ఒకవేళ ఆ రిజర్వాయర్ నిర్మించకపోయి ఉంటే.. ఆ ప్రాంతంలో ఏ పరిశ్రమ కూడా ఏర్పాటు అయ్యే అవకాశాలుండేవి కావు. ఆ రిజార్వాయర్ పుణ్యమా అని.. అక్కడి కియా ఏర్పాటు అయ్యింది. కియా ఇండియాకు రావడానికి కారణాలు ఏవైనా, తగిన వనరుల మధ్యన అది అనంతపురం జిల్లాలో ఏర్పడటానికి కారణం మాత్రం హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణమే. అందుకు సంబంధించి మరిన్ని వివరాలను కింద వీడియోలో చూడవచ్చు.