Begin typing your search above and press return to search.
సొంతింటిని అమ్మేసే అపర కుబేరుడి ఆలోచన వెనుక ఇన్ని లెక్కలా?
By: Tupaki Desk | 14 Oct 2021 4:34 AM GMTఏమీ లేనోడు.. పుట్టెడు అప్పులున్నోడు సైతం తానున్న ఇంటిని అమ్మటానికి పెద్దగా ఇష్టపడరు. ఇక.. సంపన్నుల విషయానికి వస్తే.. తానున్న ఇంటిని అమ్మకానికి పెట్టే ఆలోచనను సైతం ఇష్టపడరు కదా.. సీరియస్ అవుతారు. ఉన్న ఇంటిని అమ్మటం అన్నది పరువు సమస్యగా ఫీల్ కావటం అందరిలో ఉన్నదే. డబ్బులు.. పలుకుబడి.. ఉన్నోళ్లకు అది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు తెలిసి లెక్క.
అలాంటిది ప్రపంచంలో అత్యంత సంపన్నుడు.. అపర కుబేరుడైన టెస్లా అధినేత ఈలాస్ మస్క్ మాత్రం తానున్న ఏకైక భవంతిని అమ్మేసేందుకు సిద్ధమై అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. గతంలో తానున్న ఇంటిని అమ్ముతున్నట్లు ప్రకటించిన మళ్లీ వెనక్కి తగ్గిన ఆయన.. తాజాగా మరోసారి ఇంటి అమ్మకం వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అంతేకాదు.. గతంలో చెప్పిన దాని కంటే 15 శాతం తక్కువ ధరకే ఇంటిని ఇచ్చేస్తానంటూ ఊరిస్తున్నాడు.
అపర కుబేరుడికి ఇల్లు అమ్ముకోవాల్సిన ఖర్మేంటి? అనుకోవచ్చు. ఎవరి లెక్కలు వారికి ఉన్నట్లే ఎలాస్ లెక్కలు అతనికి ఉన్నాయి. అవన్నీ తెలిస్తే.. ఔరా అని అనుకోకుండా ఉండలేం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అతడు.. తాను ఉన్న ఏకైక ఇంటిని ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారన్న విషయంలోకి వెళ్లే ముందు.. గతంలో ఆయనకు పలు భవంతులు ఉండటం.. ఆప్తులు పోగుపడటంతో అతనిపై చాలామంది విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టారు.
దీంతో అతను తన ఆస్తుల్లో అత్యధిక భాగాన్ని అమ్మేసేందుకు డిసైడ్ అయి.. అమ్మేశారు కూడా. చివరకు అతను ఉన్న ఒకే ఒక్క ఇల్లు మిగిలింది (స్థిరాస్తి రూపంలో సుమా). ఈ ఏడాది జూన్ లో తాను ఉన్న ఇంటిని కూడా అమ్మేస్తున్నట్లుగా ప్రకటించాడు కానీ తర్వాత విరమించుకున్నాడు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న ఈ భవంతిలో ఏడు బెడ్రూంలు.. పది బాత్రూలు ఉన్నాయి. 47 ఎకరాల సువిశాల ఎస్టేట్ లో ఈ భవనం ఉంది. ప్రస్తుతం దీని ధర 32 మిలియన్ డాలర్లుగా చెబుతున్నారు.
తాజాగా తన ఇంటిని 15 శాతం డిసౌంట్ కు అమ్ముతున్నట్లుగా ప్రకటించిన ఆశ్చర్యానికి గురి చేశారు. ఇంతకీ అతను కాలిఫోర్నియాలోని తన ఇంటిని ఎందుకు అమ్మాలని డిసైడ్ అయ్యాడో తెలుసా? అక్కడ ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండటం.. తన కంపెనీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతుండటంతో.. తన హెడ్డాఫీసునుకాలిఫోర్నియా నుంచి టెక్సాస్ రాష్ట్రానికి మార్చేశారు. అక్కడ ధరలు తక్కువ. ఇప్పటికే తన ఉద్యోగుల్ని టెక్సాస్ కు షిప్టు చేసిన అతను.. తాను కూడా అక్కడికి వెళ్లాలనుకుంటున్నాడు.
తాను లేని ఇంటిని అలా వదిలేసే కన్నా.. సొమ్ము చేసుకుంటే మంచిదన్నది ఆతని ఆలోచన. అతగాడి బిజినెస్ లెక్కలు ఏ స్థాయిలో ఉంటాయనటానికి నిదర్శనంగా.. తన ఇంటి అమ్మకానికి పెట్టిన రేటును చూస్తే అర్థమవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి 15 శాతం డిస్కౌంట్ కు అమ్ముతానని చెప్పిన ధర.. అక్కడి మార్కెట్ ధరకు రెండింతలు ఉందని చెబుతున్నారు. అంటే.. అతను కోరుకున్న ధరకు ఎవరైనా కొనేందుకు ముందుకు వస్తే.. అతనికి రెట్టింపు లాభం వస్తుందన్న మాట. డబ్బుల ముందు భావోద్వేగ లెక్కలు ఎందుకుంటాయి చెప్పండి?