Begin typing your search above and press return to search.

మంత్రుల మౌనం వెనుక‌.. కొత్త రీజ‌న్‌..!

By:  Tupaki Desk   |   15 May 2021 11:30 PM GMT
మంత్రుల మౌనం వెనుక‌.. కొత్త రీజ‌న్‌..!
X
ఏపీలో జ‌గ‌న్ కేబినెట్‌లో సీఎం మిన‌మా 24 మంది మంత్రులు ఉన్నారు. అయితే.. ప్ర‌స్తుత కీల‌క స‌మ‌యంలో ఒక్క పేర్ని నాని, కొడాలి నాని స‌హా ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే మీడియా ముందుకు వ‌స్తున్నారు. మ‌రి మిగిలిన వారు ఏమ‌య్యారు ? ఎక్క‌డ ఉన్నారు ? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా.. క‌రోనా ప‌రిస్థితి తీవ్రంగా ఉంది. రోజుకు ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌రోనా బారిన ప‌డి మ‌ర‌ణిస్తుండ‌గా.. వైద్యం అంద‌క‌.. ఆసుప‌త్రుల్లో లోపాల కార‌ణంగా జ‌రుగుతున్న ప్ర‌మాదాల కార‌ణంగా.. ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

అయితే.. ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించి.. వారిలో ధైర్యం నింపేందుకు ఎవ‌రూ ప్ర‌య‌త్నించడం లేదు. ఇప్పుడు ఏపీలో ప్ర‌భుత్వం వైఖ‌రి చూస్తే.. చాలా చేస్తున్నామ‌ని చెబుతోంది. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఎక్క‌డా ధైర్యం చెప్పేవారు లేరు. అంతేకాదు.. సీనియ‌ర్ వైద్యులు క‌నీసం క‌రోనా రోగుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌, అంద‌రికీ.. ఎంత సీరియ‌స్ కండిష‌న్‌లో ఉన్నా.. జూనియ‌ర్ డాక్ట‌ర్లే గ‌తి..! దీంతో రోగుల్లో చాలా మంది మాన‌సికంగా కుంగిపోతున్నారు. ఈ క్ర‌మంలో వారికి వైద్యంతోపాటు.. నేత‌ల నుంచి వ‌చ్చే మ‌నో ధైర్యం కూడా చాలా ముఖ్యం.

ప్ర‌తి జిల్లాలోనూ మంత్రులు ఉన్నారు. వారు కోవిడ్ రోగుల‌కు ఏదో ఒక రూపంలో సందేశం ఇచ్చే ప్ర‌యత్నం చేయొచ్చు. నేరుగా కోవిడ్ కేంద్రాల‌కు వెళ్లేందుకు కొంత భ‌యం ఉన్నా.. వీడియో ద్వారా.. ఆడియో ద్వారా.. ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని ప్ర‌చారం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే.. ఏ ఒక్క మంత్రి కూడా ఈ దిశ‌గా ఆలోచ‌న చేయ‌డం లేదు. మ‌రి దీనికి రీజ‌నేంటి అంటే.. క‌రోనా కార‌ణం కాద‌ని అంటున్నారు మంత్రుల పీయేలు.

సీఎంవో నుంచి కొన్ని ఆదేశాలు వ‌చ్చాయ‌ని.. ఎవ‌రూ మాట్లాడ‌వొద్ద‌ని.. ఏదైనా ఉంటే.. ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే చూసుకుంటార‌ని వారికి ఆదేశాలు రావ‌డంతోనే ఇలా చేస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఇంత కీల‌క స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మంత్రులు కూడా ఇది స‌రికాద‌ని గుస‌గుస‌లాడుతుండ‌డం గ‌మ‌నార్హం.