Begin typing your search above and press return to search.

నమ్మలేని నిజం;బీజింగ్ భూమిలోకి కుంగిపోతోంది

By:  Tupaki Desk   |   30 Jun 2016 4:33 AM GMT
నమ్మలేని నిజం;బీజింగ్ భూమిలోకి కుంగిపోతోంది
X
పర్యావరణాన్ని ఇష్టారాజ్యంగా ధ్వంసం చేసే వ్యవస్థలకు ప్రకృతి శాపం ఇస్తుందా? తనను నాశనం చేస్తున్న వారికి ప్రకృతి శిక్ష వేస్తుందా? అన్న భావన కలిగే ఉదంతంగా దీన్ని చెప్పాలి. నమ్మలేకున్నా ఇది నిజమని చెప్పాలి. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటైన చైనా రాజధాని బీజింగ్ తాను చేసిన తప్పులకు ప్రకృతి శిక్ష విధిస్తోంది మరి. ఈ మహానగరం ఏడాదికి నాలుగు అంగుళాల చొప్పున భూమిలోకి కుంగిపోతుందన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఎత్తైన భవనాల నిర్మాణాలకు పోటీ పడటం.. భూగర్భ జలాల్ని అతిగా వినియోగించటం లాంటి కారణాల వల్ల ఇలాంటి విపరీత పరిస్థితులు ఏర్పడినట్లుగా చెబుతున్నారు. 2003 నుంచి 2010 మధ్యన ఉపగ్రహాల సాయంతో హైరెజుల్యూషన్ చిత్రాలతో అధ్యయనం చేసిన నిపుణులకు షాకింగ్ కలిగించే ఈ అంశాన్ని గుర్తించారు. అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా భారీ భవనాల్ని నిర్మించటం.. భూగర్భ జలాల్ని తోడేయటం లాంటి ఘటనలతో ఈ దారుణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నట్లు గుర్తించారు.

మరింత ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే.. బీజింగ్ లోనిపలు ప్రాంతాలు 11 సెంటీమీటర్ల మేర భూమిలోకి కుంగిపోతుంటే.. తూర్పు ప్రాంతంలో మాత్రం ఇది వంద సెంటీమీటర్లుగా ఉన్నట్లు అంచనా వేశారు. ఎత్తైన భవనాల్నినిర్మించటం.. భూగర్భ జలాల్ని ఇష్టానుసారం వాడేయటంతో పాటు.. భూ పొరల మందం.. మట్టి లక్షణాల కారణంగా ఈ పరిస్థితి నెలకొందన్న విషయాన్ని గుర్తించారు. భూగర్భ జలాలు అతిగా వాడేయటంతో నగరం కుంగుబాటుకు గురి అవుతున్న విషయాన్ని గుర్తించారు. మరీ విషయంలో చైనా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో..?