Begin typing your search above and press return to search.
ఫోన్లో ఆ పనిస్తే.. మీ పని ఖతం!
By: Tupaki Desk | 30 April 2021 11:30 PM GMTఅపొజిట్ జెండర్ తో రిలేషన్ ఎప్పుడూ సమ్మగా ఉంటుంది. ఈ విషయంలో అబ్బాయిల యవ్వారం గురించి చెప్పాల్సిన పనేలేదు. కొత్తగా అమ్మాయి కనిపిస్తే చాలు.. ఎవరు? ఏంటీ అనే వివరాలేవీ అవసరం లే. నవ్వితే.. నవ్వేయడం. కవ్విస్తే పడిపోవడం. ఈ వీక్ పాయింట్ ను పట్టుకుని చుట్టూ ఎన్ని ప్రమాదాలు తయారయ్యాయో ఎవ్వరికీ తెలియదు. అలాంటి వాటిల్లో ఒకటే డేటింగ్ యాప్స్. అవి ఎలా వలవేస్తాయో చూద్దాం.
మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. ఓ మెసేజ్ వస్తుంది నేను ఫ్రీగా ఉన్నా.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటూ! లేదంటే.. ఫోన్ కూడా వస్తుంది. అదీకాదంటే,.. ఆన్ లైన్లో యాడ్స్ రూపంలో. ఈ మూడు మార్గాల్లో దేంట్లోకి ప్రవేశించినా.. ఎగబడి మీతో స్నేహం చేయడానికి అమ్మాయిలు క్యూ కడతారు. ముందే చెప్పుకున్నాం కదా.. సమ్మగా ఉంటుందని! వెంటనే చాటింగ్ మొదలుపెట్టి.. మీటింగ్ కు రెడీ అయిపోతారు. చిన్న కండీషన్ అంటారు. జస్ట్ ఎంట్రీ ఫీజుకోసం రూ.199 కట్టమంటారు. అంతదాకా వచ్చాక ఈ డబ్బులకు వెనకాడటం ఎందుకని చెల్లించేస్తారు.
మత్తెక్కించే మాటల్లోకి దింపేసి.. కైపులోకి ఎక్కడికో... తీసుకెళ్లిపోతారు. ఎంత సేపూ మాటలేనా.. ఇంకాస్త ముందుకెళ్దాం అంటూ వీడియోకాల్ కు సిద్ధమైపోతారు. ఇక్కడ ఉద్రేకం ఆగిచావదుగా..? ఆల్ రైట్ అనేస్తారు. అప్పుడు మరో చిన్న కండీషన్. కాల్ లిఫ్ట్ కావాలంటే జస్ట్ రూ.499 కట్టమంటారు. అవసరమా? అని ఆలోచించే కండీషన్లో ఉండనివ్వరు. అవతల స్వర్గం వెయిట్ చేస్తోందని చెప్తారు. ఆ తర్వాత అవతల బట్టలు విప్పేసి మాట్లాడుతారు.. ఇక్కడ కూడా తెలియకుండానే విప్పించేస్తారు. ఆ తర్వాత.. నీ అంతఃసౌందర్యాన్ని.. బాహ్య ప్రపంచానికి చూపిస్తానని బెదిరింపులు. అలా చేయొద్దంటే ఏం చేయాలో తెలుసుగా..? అంటారు. ఇక్కడి నుంచి డబ్బులు పోతూనే ఉంటాయి. అవి వేలు దాటి లక్షలకు చేరుకుంటాయి. తట్టుకోలేనివారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు.
ఈ విధంగా దేశంలో నిమిషానికి సుమారు 230 మంది మోసపోతున్నారట. సంవత్సరానికి సగటున 12 కోట్ల మంది డేటింగ్ యాప్స్ మాయలో పడుతున్నారట. వీళ్లంతా రోజుకు పోగొట్టుకుంటున్న డబ్బులు ఎన్నో తెలుసా? రూ.6.5 కోట్లు! ఇక, సంవత్సరానికి ఈ డేటింగ్ యాప్స్ కొల్లగొడుతున్న మొత్తం ఎంతో తెలుసా? అక్షరాలా.. 2,395 కోట్ల రూపాయలు! మీరు కూడా బాధితుల సంఘంలో సభ్యత్వం పొందకుండా ఉండాలంటే.. ఏం చేయాలో తెలుసు కదా? అదన్నమాట సంగతి.