Begin typing your search above and press return to search.
పెళ్లితో ఆరోగ్యం సూపర్ గా ఉంటుందట
By: Tupaki Desk | 9 Jun 2017 5:30 PM GMTపెళ్లి మీద ఎన్ని జోకులో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. పెళ్లితోనే కొత్త తిప్పలు మొదలవుతాయని అటు అబ్బాయే కాదు.. ఈ మధ్యన అమ్మాయిలు కూడా తెగ ఫీలైపోతున్నారు. ఎవరి ఫీలింగులు ఎలా ఉన్నా.. బ్రిటన్ కు చెందిన ఆస్టన్ యూనివర్సిటీ మాత్రం పెళ్లి మీద సరికొత్త విషయాల్ని తెర మీదకు తీసుకొచ్చింది.
పెళ్లి చేసుకుంటే మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఆరోగ్యం మాత్రం అద్భుతంగా ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ మాటను ఏదో ఆషామాషీగా చెప్పటం కాకుండా.. భారీ రీసెర్చ్ చేసిన తర్వాతే విషయాన్ని చెప్పుకొచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి అధ్యయనాలు ఎవరెవరో చేస్తుంటారు. కానీ.. పెళ్లి మీద చేసిన తాజా అధ్యయనంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త రాహుల్ పొట్లూరి కూడా ఉండటం విశేషం. పెళ్లితో ఆరోగ్యం ఎంతగా మెరుగుపడుతుందన్న విషయాన్ని గణాంకాల రూపంలో స్పష్టం చేస్తున్నారు.
గుండె జబ్బులు.. రక్తపోటు.. అధిక కొలెస్ట్రాల్.. మధుమేహం లాంటి ముప్పు ఎదుర్కొంటున్న దాదాపు పది లక్షల మంది మీద అధ్యయనం జరిపిన తర్వాత తేల్చిందేమంటే.. పెళ్లి.. ఆరోగ్యానికి ఎంతో హాయి అని చెబుతున్నారు. సుదీర్ఘకాలం పాటు జరిపిన పరిశోధనలో దశల వారీగా ఆరోగ్య వివరాలు సేకరించి.. విశ్లేషించి తేల్చిందేమంటే.. అధిక కొలెస్ట్రాల్ బాధితుల్లో బతికి ఉన్న వారి సంఖ్య పెళ్లి చేసుకున్న వారితో పోలిస్తే చేసుకోని వారి సంఖ్య చాలా తక్కువ ఉన్నట్లు తేల్చారు.
ఒంటరిగా ఉన్న వారితో పోలిస్తే.. పెళ్లి చేసుకున్న వారు అనారోగ్యంతో ఉన్న నిక్షేపంగా ఉన్నట్లు తేల్చారు. సింగిల్ గా ఉండే వారితో పోలిస్తే.. పెళ్లి చేసుకున్న వారు తమ ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధను ప్రదర్శించటంతో పాటు.. జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. కుటుంబం కారణంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే గుణం అలవాటు అవతుందని.. అదే వారికి శ్రీరామరక్షగా మారుతుందని చెబుతున్నారు. సో.. పెళ్లి మీద నెగిటివ్ గా ఎంత మాట్లాడినా.. ఆ పెళ్లి మాత్రం పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుతోందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/